Begin typing your search above and press return to search.

గూఢచారి విశ్వం 'బాహుబ‌లి 2' రికార్డుల్ని ట‌చ్ చేస్తుందా?

By:  Tupaki Desk   |   25 Jan 2023 9:23 AM GMT
గూఢచారి విశ్వం బాహుబ‌లి 2 రికార్డుల్ని ట‌చ్ చేస్తుందా?
X
సిద్ధార్థ్ ఆనంద్ 'పఠాన్‌'తో షారూఖ్ ఖాన్ నాలుగు సంవత్సరాల తర్వాత తిరిగి తెరపైకి దూసుకొస్తున్నాడు. దీపికా పదుకొనే- జాన్ అబ్రహం- డింపుల్ కపాడియా- అశుతోష్ రానా త‌దిత‌రులు ఈ భారీ యాక్ష‌న్ చిత్రంలో నటించారు. ఇది YRF గూఢచారి విశ్వంలో ఒక భాగం.

సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో అతిధి పాత్రలో న‌టించారు. ప‌ఠాన్ లో ఆ ఇద్ద‌రూ క‌లిసి క‌నిపించే ఫ్రేమ్ ల‌ను ద‌ర్శ‌కుడు చిత్రీకరించారని షారుఖ్ గతంలో ధృవీకరించారు. వార్ కూడా టైగర్ - పఠాన్ త‌ర‌హా విశ్వానికి చెందినది కాబట్టి హృతిక్ రోషన్ కూడా ప‌ఠాన్ లో అతిధి పాత్రలో కనిపిస్తాడా లేదా అనేది స‌స్పెన్స్ గా మారింది.

పఠాన్ క‌థాంశం ఇప్ప‌టికే లీకైంది. షారుఖ్ ఖాన్ ఇందులో RAW ఏజెంట్ గా నటించాడు. కానీ త‌న విధుల నుంచి అతను కొంతకాలం విశ్రాంతి తీసుకుంటాడు. అదే క్ర‌మంలో విల‌న్లు జాన్ అబ్రహం - జిమ్ భార‌త‌ దేశానికి ముప్పు తెస్తారు.

దీంతో త‌ప్ప‌నిస‌రై తిరిగి ప‌ఠాన్ విధుల్లోకి వస్తాడు. ట్రైలర్ చూడ‌గానే ఇది యాక్షన్ ప్యాక్డ్ చిత్రమ‌ని భ‌రోసా క‌లిగింది. ఈ సినిమా భారీ ఓపెనింగుల‌తో సంచ‌ల‌నం సృష్ఠించ‌నుంద‌ని ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో క‌థ‌నాలొచ్చాయి.

బాహుబ‌లి ఫ్రాంఛైజీ- ఆర్.ఆర్.ఆర్ స‌క్సెస్ లు చూశాక య‌ష్ రాజ్ ఫిలింస్ అలాంటి భారీ పాన్ ఇండియా సినిమాల‌పై దృష్ఠి సారించింది. ఇప్పుడు గూఢ‌చారి విశ్వం పేరుతో వార్-టైగ‌ర్- ప‌ఠాన్ ల‌ను క‌లుపుతూ హృతిక్ తో షారూఖ్‌-స‌ల్మాన్ లాంటి ఇరువురు దిగ్గ‌జాల‌ను ఒక‌చోట చేర్చ‌డం ద్వారా భార‌త‌దేశంలోని అన్ని సినిమాల రికార్డుల‌ను బ్రేక్ చేయాల‌ని ప‌న్నాగం ప‌న్నారు.

కానీ ఈ ప్ర‌య‌త్నం ఎంత‌వ‌ర‌కూ స‌ఫల‌మ‌వుతుందో.. మునుముందు ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి. ప‌ఠాన్ ఇప్ప‌టివ‌ర‌కూ నిలిచి ఉన్న బాహుబ‌లి 2 రికార్డును కొట్టేస్తుందా? అన్న‌ది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.