చేతినిండా సినిమాలు.. పాన్ ఇండియా స్టార్ వేగం పెంచుతాడా??

Thu Jun 17 2021 21:00:01 GMT+0530 (IST)

Will Pan India Star Increase Speed

సినీ ఇండస్ట్రీలో కొన్నిసార్లు విచిత్రాలు జరుగుతుంటాయి. టైమ్ బాగున్నప్పుడు అప్ కమింగ్ హీరోలు కూడా స్టార్ హీరోలు అయిపోతారు. అదే టైమ్ బాలేకపోతే ఎన్ని సినిమాలు చేసినా మొదలైన చోటే నిలిచిపోతారు. ఇదే పరిస్థితి కొన్నిసార్లు పాన్ ఇండియా స్టార్ హీరోలకు కూడా జరుగుతుంది. టైమ్ బాగుంటే సినిమాలు లేవని అనుకున్నప్పుడు చేతినిండా సినిమాలు లైనప్ అయిపోతాయి. అదే టైమ్ బాలేకపోతే మాత్రం చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నప్పటికీ ఒకటి కూడా రిలీజ్ చేసుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలన్ని పాన్ ఇండియావే. కానీ కరోనా టైం కాబట్టి సమయం కుదరక అన్ని సినిమాలు అలాగే మిగిలిపోయాయి. అసలు ముగిసింది అనుకున్న రాధేశ్యామ్ సినిమా కూడా చిన్న షెడ్యూల్ ఉందని టాక్ వచ్చింది. ఒకవేళ ఇప్పుడు థియేటర్స్ తెరుచుకున్నా రాధేశ్యామ్ సినిమా వెంటనే రిలీజ్ అవుతుందా అంటే అదికూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఆల్రెడీ స్మాల్ షెడ్యూల్ షూటింగ్ ఉంది కాబట్టి. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ టైమ్ ఏ విధంగా నడుస్తుందో. రాధేశ్యామ్ మాత్రమే కాకుండా ఖాతాలో మరో రెండు ఆల్రెడీ షూటింగ్స్ స్టేజిలో ఉన్నాయి.

పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ సలార్.. బాలీవుడ్ ఓం రౌత్ దర్శకత్వంలో మైథిలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకొని తదుపరి షెడ్యూల్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ కరోనా కారణంగా ఇన్నిరోజులు షూటింగ్స్ బ్రేక్ పడి ఆలస్యం అయిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే సినిమాలకు సంబంధించి షూటింగ్స్ ప్రారంభం అవుతుండటంతో వరుసగా ఒక్కో సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేసేయాలని ప్లాన్ చేస్తున్నాడట ప్రభాస్. అందుకే తాజాగా తన డైరెక్టర్స్ అందరికి వీలైనంత త్వరగా షూటింగ్స్ కంప్లీట్ చేసే మార్గం చూడాలని చెప్పినట్లు సమాచారం. మరి ఈ మూడు సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సై-ఫై సినిమా ఉంది. అందుకే త్వరగా ఫినిష్ చేసే ఆలోచన చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.