Begin typing your search above and press return to search.

దసరాతో నాని టైర్ 1లోకి వెళ్లగలడా?

By:  Tupaki Desk   |   29 March 2023 12:00 PM GMT
దసరాతో నాని టైర్ 1లోకి వెళ్లగలడా?
X
నాచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న సినిమా దసరా గురించి అందరికీ తెలిసిందే. అయితే దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదలకానున్న ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. పక్కా మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీగా బడ్జెట్ పెట్టి నిర్మిస్తున్నారు.

అయితే టైర్ 2 హీరో అయిన నాని దసరా చిత్రం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించి టాప్ చిత్రంగా నిలుస్తుందా లేదా అనేది చూడాలి. ఇది వరకు టైర్ 2 హీరోలు అయిన పలువురి చిత్రాలు తెలంగాణ, ఏపీల్లో భారీ వసూళ్లను రాబట్టుకోగలిగాయి. అయితే ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంయుక్తంగా నిర్మించిన లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. అయితే ఈ చిత్రం మొదటి రోజు రూ.9.57 కోట్ల షేర్ ను రాబట్టుకుంది. ఆ తర్వాత ఈ చిత్రం ప్లాప్ గా నిలిచింది. అలాగే పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో రామ్ పోతినేని హీరోగా.. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా రూ.7.73 కోట్ల వసూళ్లను రాబట్టింది.

వి.వి వినాయక్ డైరెక్షన్ లో అక్కినేని అఖిల్ హీరోగా, సయేషా సైగల్ హీరోయిన్ గా వచ్చిన అఖిల్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం రూ.7.60 కోట్లు రాబట్టింది.

అలాగే నాని, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో వచ్చిన ఎంసీఏ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.7.57 కోట్ల షేర్ ను రాబట్టుకుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా భరత్ కమ్మ దర్శకత్వం వహించిన డియర్ కామ్రేడ్ చిత్రం కూడా రూ.7.57 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.

మరి నాని దసరా సినిమా కూడా భారీ వసూళ్లనే రాబట్టుకుంటుందా లేదా తెలియాలంటే ఇంకా కొంత కాలం వేచి చూడాల్సిందే. టైర్ 2 హీరోగా ఉన్న అతడు భారీ వసూళ్లను రాబట్టుకొని.. బ్లాక్ బస్టర్ గా నిలిచి టైర్ 1 లోకి చేరగలడో లేదో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.