ఈసారైనా కృష్ణవంశీ బిజీ అవుతారా!

Thu Mar 23 2023 12:01:09 GMT+0530 (India Standard Time)

Will Krishna Vasmshi Become Busy From Now

ఎట్టకేలకు క్రియేటివ్ మేకర్ కృష్ణవంశీ  'రంగమార్తాండ' సక్సెస్ అయింది. సినిమాకి పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. తొలి షోతోనే హిట్ బొమ్మ అని విమర్శకులు మెచ్చారు. కృష్ణవంశీ ఈజ్ బ్యాక్ అనిపించారు. అంతకు ముందే సినిమాకి అన్ని పాజిటివ్ వైబ్స్ ఉన్నా?  ప్రేక్షకులు ఎలా రివీస్ చేసుకుంటారా? అన్న టెన్షన్ లోలోపల ఉండేది. ఇప్పుడా టెన్షన్ నుంచి వంశీ పూర్తిగా బయటకు వచ్చేసారు.



తన కష్టానికి తగ్గ ఫలితం దక్కిందన్న ఆనందంలో ఉన్నారు. అయితే అంతిమంగా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు  సాధిస్తుంది! అన్న లెక్క తేలడానికి కొంచెం సమయం పడుతుంది. మరి సినిమా కమర్శియల్ గా వర్కౌట్ అవుతుందా?  అన్నది తర్వాత డిసైడ్ అవుతుంది. ప్రస్తుతానికైతే వంశీ రిలాక్స్ అయిపోయారు. ప్రకాష్ రాజ్ తనకి అప్పగించిన బాధ్యతల్ని దిగ్విజయంగా పూర్తిచేసారు.

ప్రకాష్ రాజ్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారు. ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టే వంశీ ఈ  సినిమా చేసారు. మరి ఇప్పుడైనా కృష్ణవంశృని స్టార్ హీరోలు నమ్ముతారా? అన్నది చూడాలి. 'చందమామ' తర్వాత కృష్ణ వంశీకి చెప్పుకోదగ్గ సక్సెస్ ఒక్కటీ లేదు.  ఆ సినిమా తర్వాత వరుసగా ఆరు సినిమాలు నిరాశపరిచాయి. 'గోవిందుడు అందరివాడేలే' సినిమా సమయంలో వంశీ పనైపోయిందని విమర్శలొచ్చాయి.

ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వకపోవడంతో? ఇక అవకాశాలు కష్టమే అనుకున్న సమయంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'నక్షత్రం' తెరకెక్కించి విఫలమయ్యారు. దీంతో  ఐదేళ్ల పాటు గ్యాప్ వచ్చింది. ఏ హీరో -నిర్మాత అవకాశం  ఇవ్వలేదు. ఈ క్రమంలో  మారాఠి సినిమా 'నట సామ్రాట్' ని 'రంగమార్తాండ' గా  రీమేక్ చేసారు. అదీ ప్రకాష్ రాజ్ ప్రోత్భలంతోనే జరిగింది. మరి తాజా సక్సెస్ కృష్ణవంశీని మళ్లీ బిజీ దర్శకుడిగా మారుస్తుందా?  స్టార్ హీరోలు అవకాశాలు కల్పిస్తారా?  అన్నది చూడాలి.

అయితే 'రంగమార్తాండ' రీమేక్ కథ కావడం వంశీపై కొంత ప్రతికూలత పడే అవకాశం ఉంది. సొంత కథతో హిట్ కొడితే ఆ లెక్క మార్కెట్ లో వేరే లెవల్లో ఉంటుంది. రీమేక్ సినిమాతో హిట్ అంటే?  చాలా సమీకరణాలు తెరపైకి వస్తుంటాయి. గతంలో రీమేక్ లు చేసి హిట్లు అందుకున్న కొంత మంది దర్శకులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నారు. పైగా ఇప్పుడు హీరోలంతా పాన్ ఇండియా కంటెంట్ ని చూజ్ చేసుకుం టున్నారు.

అదీ ట్రెండింగ్ కాన్సెప్ట్ ఉండేలా చూసుకుం టున్నారు. వీలైనంత వరకూ పాన్ ఇండియా  దర్శకులకే పెద్ద పీట వేస్తున్నారు. రామ్ చరణ్- మహేష్- ఎన్టీఆర్ లాంటి స్టార్లను కృష్ణ వంశీ ఇప్పుడున్ని స్థితిలో ఒప్పించడం అంటే చిన్న విషయం కాదు. వాళ్లంతా నవతరం దర్శకులవైపు మొగ్గు చూపుతున్నారు. ఒక్క సినిమా అయినా అది సాలిడ్ హిట్ అయితే! మరో ఆలోచన లేకుండా పిలిచి మరీ ఛాన్స్ ఇస్తున్నారు.  మరి అంత సాలిడ్  సక్సెస్ 'రంగమార్తాండ' బాక్సాఫీస్ వద్ద నమోదు చేస్తుందా? అన్నది చూడాలి.       


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.