వీక్ డేస్ లో బాగా వీక్ అయిన 'హిట్ 2'.. ఆ టార్గెట్ కష్టమే

Tue Dec 06 2022 19:14:08 GMT+0530 (India Standard Time)

Will HIT 2 Movie Reach the Target Collections

అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో నాని సమర్పణలో రూపొందిన హిట్ 2 సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల అయిన మొదటి రోజు పాజిటివ్ టాక్ ను దక్కించుకుని మంచి వసూళ్లను నమోదు చేసింది. మొదటి రోజు గౌరవ ప్రధమైన ఓపెనింగ్స్ ను దక్కించుకోవడంతో లాంగ్ రన్ కలెక్షన్స్ పై చాలా ఆశలు పెరిగాయి.మొదటి రోజు ఏకంగా 3.75 కోట్ల రూపాయలకు పైగా షేర్ నమోదు అయ్యింది. పైగా తదుపరి వారం పెద్ద సినిమాలు ఏమీ లేవు. దాంతో రెండు వారాల పాటు హిట్ 2 జోరు కొనసాగుతోంది.. తద్వార పాతిక నుండి ముప్పై కోట్ల షేర్ ను హిట్ 2 దక్కించుకునే అవకాశం ఉందని అంతా భావించారు.

మొదటి రోజు మంచి కలెక్షన్స్ నమోదు చేసిన తర్వాత రెండో రోజు అయిన శనివారం కూడా హిట్ 2 దాదాపుగా మూడు కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది. ఇక మూడు రోజు అయిన ఆదివారం కూడా మూడు కోట్లకు కాస్త తక్కువగా కలెక్ట్ చేయడం జరిగింది. మొదటి మూడు రోజుల్లో సినిమా కలెక్షన్స్ దాదాపుగా పది కోట్ల రూపాయలు నమోదు అయ్యాయి.

వీక్ డేస్ మొదలు అయ్యేప్పటికి సినిమా కలెక్షన్స్ కూడా వీక్ అయ్యాయి. అనూహ్యంగా సోమవారం రోజు కోటి లోపు షేర్ ను రాబట్టింది. ఒక్కసారిగా సగానికి పైగా షేర్ తగ్గడం తో ఈ వారం అంతే పరిస్థితి ఎలా ఉంటుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మళ్లీ వీకెండ్ వరకు థియేటర్ లలో హిట్ 2 ఉంటే కచ్చితంగా మరో అయిదు నుండి ఆరు కోట్ల రూపాయల షేర్ నమోదు అయ్యే అవకాశం ఉంది. కనుక హిట్ 2 ను అప్పటి వరకు కొనసాగిస్తారా అనేది చూడాలి.

ఈ వారం 15 సినిమాలకు పైగా బాక్సాఫీస్ వద్ద దండయాత్ర కు వస్తున్నాయి. కనుక హిట్ 2 ఆ జోరులో నిలిచేనా అనేది కూడా చూడాలి. మొత్తానికి ఈ సినిమా అనుకున్న టార్గెట్ ను రీచ్ అవుతుందా అనేది అనుమానంగా మిగిలింది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.