వెబ్ కంటెంట్ కు సెన్సార్.. జరిగే పనేనా..?

Mon Mar 20 2023 17:00:01 GMT+0530 (India Standard Time)

Will Censor For Web Content Possible

ఎంటర్టైన్ మెంట్ కు మరో మార్గంగా మారిన ఓటీటీ ప్లాట్ ఫాంలు ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్ మెంట్ మొత్తం ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. అయితే ఈ క్రమంలో బోల్డ్ కంటెంట్ ను ఎక్కువ ప్రోత్సహిస్తుంది అన్నది ఒప్పుకోవాల్సిందే.వెబ్ సీరీస్ అంటే బోల్డ్ సీన్స్ పక్కా అనేలా టాక్ వచ్చేసింది. బోల్డ్ సీన్స్ మాత్రమే కాదు బీప్ వినిపించాల్సిన కొన్ని మాటలు కూడా ఇక్కడ ఎలాంటి బీప్ సౌండ్స్ లేకుండా వదులుతున్నారు. రీసెంట్ గా వచ్చిన రానా నాయుడు వెబ్ సీరీస్ చూసి బాబోయ్ అన్న వారు చాలా మంది ఉన్నారు.

అయితే అది వెంకటేష్ రానాలు చేశారు కాబట్టి అంత ప్రచారం పొందింది. ఇంతకుముందు వచ్చిన మీర్జాపూర్ సినిమాలో ఇంతకన్నా ఎక్కువ బూతు మాటలే ఉన్నాయి. అయితే అందులో నటీనటులు పెద్దగా ఎవరికీ తెలియదు కాబట్టి దాన్ని పట్టించుకోలేదు.

అయితే రానా నాయుడు అనే కాదు వెబ్ కంటెంట్ ఏదైనా బోల్డ్ సీన్స్ డైలాగ్స్ విషయంలో హద్దు మీరుతున్నాఉయని చెప్పొచ్చు. అందుకే వీటికి కూడా సెన్సార్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట కేంద్ర ప్రభుత్వం. అయితే సినిమాలకు అయితే సెన్సార్ కంపల్సరీ కానీ వెబ్ కంటెంట్ ఇండిపెండెంట్ మూవీస్ కి సెన్సార్ అంటే చాలా కష్టం.

వేల కొద్దీగా వచ్చే ఈ సీరీస్ లకు ఇండిపెండెంట్ మూవీస్ కు సెన్సార్ ఎలా చేస్తారన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇతర దేశాల్లో వెబ్ కంటెంట్ కి కూడా సెన్సార్ ఉంటుంది. అందుకే అక్కడ రిలీజ్ అవ్వని కొన్ని వెబ్ సీరీస్ లు ఇండియాలో రిలీజై సక్సెస్ అందుకుంటున్నాయి.

మరి ఇక్కడ కూడా వెబ్ కంటెంట్ మీద సెన్సార్ చేసే అవకాశం ఉంటుందా దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.