స్టార్ హీరో సలహాని బుచ్చిబాబు పాటిస్తాడా?

Wed Jul 06 2022 08:00:01 GMT+0530 (IST)

Will Buchibabu follow the star hero advice

స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా `ఉప్పెన` మూవీతో దర్శకుడిగా పరిచయమైన విషం తెలిసిందే. మెగా స్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ కృతి శెట్టి ఈ మూవీతో హీరో హీరోయిన్ లుగా పరిచయం అయ్యారు. హృద్యమైన మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించిన వంద కోట్ల క్లబ్ లో చేరిన ఓ డెబ్యూ డైరెక్టర్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది.దీంతో ఇండస్ట్రీ చూపు దర్శకుడు బుచ్చిబాబుపై పడింది. చాల ఆమంది బుచ్చిబాబుతో సినిమా చేయడానికి రెడీ అయిపోయారు. అయితే బుచ్చిబాబు మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తన రెండవ సినిమాని పట్టాలెక్కించడానికి సిద్ధపడ్డారు. అనుకున్న వెంటనే ఎన్టీఆర్ కు కథ వినిపించడం తను ఓకే చెప్పడం చక చకా జరిగిపోయాయి. శ్రీకాకుళం నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించాలని ప్లాన్ చేశారు.

ఈ మూవీకి `పెద్ది` అనే టైటిల్ ని కూడా అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బుచ్చిబాబు ప్రాజెక్ట్ పక్కకు వెళ్లిపోయింది.

ఎన్టీఆర్ తన 30వ సినిమాని స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో 31 వ ప్రాజెక్ట్ ని `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ల కారణంగానే బుచ్చి బాబు ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లింది. అయితే ఈ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ పక్కన పెట్టేశారని ఈ మూవీ చేయరని వరుస కథనాలు వెలుగులోకి వచ్చాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టలేదని తను అంగీకరించిన రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు పూర్తయిన తరువాత ఈ సినిమాని ఖచ్చితంగా చేస్తారని తెలుస్తోంది. ఈ నేఫథ్యంలోనే ఎన్టీఆర్ ఇటీవల బుచ్చిబాబుని ప్రత్యేకంగా పిలిపించుకుని కథలో మార్పులు చేయాలని లవ్ స్టోరీ ప్రత్యేకంగా వుండాలని దీనిపై వర్క్ చేయమని సలహా ఇచ్చారట. `పెద్ది` కథ బాగుందని అయితే ఇందులో లవ్ ట్రాక్ కూడా ఆసక్తికరంగా వుండాలని సూచించారట.

`ఉప్పెన` వంటి లవ్ స్టోరీతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన బుచ్చిబాబు హీరో ఎన్టీఆర్ చెప్పిన సలహాని పాటిస్తాడా? .. పాటించి తను చెప్పినట్టుగానే `పెద్ది` కథలో లవ్ స్టోరీని మరింత హైలైట్ చేస్తాడా? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.