హిట్ మల్టీవర్స్ లోకి బాలకృష్ణ ఎంట్రీ ఇస్తారా?

Mon Dec 05 2022 14:36:07 GMT+0530 (India Standard Time)

Will Balakrishna Enter The Hit Multiverse?

యంగ్ అంట్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'హిట్ 2' రీపెంట్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద గుడ్ టాక్ తో దూసుకుపోతోంది. మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ శుక్రవారం విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకుంది. సినిమా నచ్చడంతో ప్రేక్షకులు ఫస్ట్ షో నుంచే ఆ మూవీకి బాక్సాఫీస్ వద్ద ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా ఈ మూవీ టీమ్ హీరో అడివి శేష్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.సినిమా రిలీజ్ రోజే అడివి శేష్ ని ఉత్తేశిస్తూ హీరో మహేష్ ట్వీట్ చేయడం.. సినిమా ఎప్పుడు చూస్తానని ఆసక్తిని చూపించడం తెలిసిందే. అయితే రీసెంట్ గా సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఈ మూవీని తన తనయుడు మోక్షజ్ఞతో కలిసి ప్రత్యేకంగా వీక్షించారు. చిత్ర బృందాన్ని ప్రదర్శన అనంతరం బాలయ్య ప్రత్యేకంగా అభినందించారట. ఇందుకు సంబంధించిన ఫొటోలని బాలయ్య 'హిట్ 2' టీమ్ తో కలిసి గడిపిన ఆనందక్షణాలకు సంబంధించిన ఫొటోలని హీరో అడివి శేష్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.  

బాలకృష్ణగారికి హిట్ 2 చాలా నచ్చిందని దర్శకుడు శైలేష్ కొలను విజన్ ను నా నటనను ఆయన ప్రశంసించారని హిట్ సినిమాలో కనిపించాలని సరగాగా బాలయ్యను అడిగానని' అడివి శేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు.

అయితే అడివి శేష్ అడిగిన సందర్భంలో బాలయ్య యస్ అనలేదు. అలా అని నో అని కూడా చెప్పకుండా నవ్వినట్టుగా తెలుస్తోంది. అంటే హిట్ వరల్డ్ లోకి ఎంట్రీ కి బాలయ్య సుముఖంగా వున్నారా? అనే చర్చ మొదలైంది. బాలయ్య ఫ్యాన్స్ మాత్రం 'హిట్ 'వరల్డ్ లోకి బాలయ్య ఎంట్రీ ఇస్తే చూడాలని వుందని చెబుతున్నారట.    

మరి బాలయ్య కూడా ఆసక్తిగా వున్నారా? .. నాని ఆఫర్ చేస్తే 'హిట్ 4'లోకి ఎంట్రీ ఇస్తారా? అన్నది వేచి చూడాల్సిందే. గతంతో పోలిస్తే బాలకృష్ణలో వచ్చిన మార్పుని చూస్తే ఇది సాధ్యం అవుతుందని అంటున్నారు. గతంలో ప్రతీ విషయానికి బాలయ్య సీరియస్ యాంగిల్ లోనే స్పందించే వారు. సెట్ లోనూ అదే పంథాని అనుసరించడంతో బాలకృష్ణతో జోవియల్ గా మాట్లాడాలన్నా చాలా మంది భయపడేవారు.

ఎప్పుడైతే 'అన్ స్టాపబుల్' టాక్ షోలో బాలయ్య అందరితో కలిసి జోవియల్ గా వుండటం.. కామెడీ చేస్తూ షోలోకి అగుడుపెట్టిన వారిని ఆటపట్టించడం చూస్తుంటే బాలయ్య పూర్తిగా మారిపోయారని 'హిట్ 4' చేసినా ఆశ్చర్యం లేదనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. కొంత మంది మాత్రం బాలయ్య 'హిట్ 4' మరీ సిల్లీగా లేదూ అంటూ కామెంట్ లు చేస్తున్నారు. మరి బాలయ్య మనసుతో ఏముందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.