అరియానా మరో నైనా గంగూలీ అవుతుందా?

Wed Jun 23 2021 22:00:01 GMT+0530 (IST)

Will Ariana become another naina Ganguly

ఆర్జీవీ డీ కంపెనీలో చేరాక ఇండస్ట్రీలో కథానాయికగా అవకాశాలు పెరుగుతాయా? అంటే .. ఇటీవలి కాలంలో ఓ ఇద్దరు భామల్ని పరిశ్రమలో ఉదహరిస్తున్నారు. అందులో నైనా గంగూలీ.. అప్సరా రాణీ పేర్లు మార్మోగుతున్నాయి. శృంగార నాయికలుగా ఆ ఇద్దరినీ ఇండస్ట్రీ వర్గాలు చూస్తున్నాయా..! అంటే అలాంటి ఇమేజ్ ని క్రియేట్ చేసే ఫోటోషూట్లు చేయడం ఆర్జీవీ గైడెన్స్ గురించి యూత్ లో చర్చ సాగింది.ఇప్పుడు ఆ ఇద్దరి బాటలోనే తెలుగమ్మాయి అరియానాను ఆర్జీవీ ప్రమోట్ చేస్తున్నారా? అంటే అవుననే ఇటీవలి జిమ్ ఇంటర్వ్యూ వెల్లడించింది. అరియాన - ఆర్జీవీ ఇంటర్ వ్యూ జనంలో బాగానే వైరల్ అవుతోంది. అలానే దీనిపై తీవ్రమైన ట్రోల్స్ ఎదురవుతున్నాయి. అయితే అంతా అరియాన మరో నైనా గంగూలీ అవుతుందని.. ఆర్జీవీ దగ్గర ఉంటే ఇక అంతే సంగతి..! అని కామెంట్స్ చేస్తున్నారు.

యావరేజ్ అమ్మాయిని కూడా హాట్ గా చూపించడం ఆర్జీవీకే చెల్లిందనేది ఈ ఇంటర్ వ్యూ కి వచ్చిన పాజిటివ్ కామెంట్.. ఇది అరియానాకు ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.