మెగా కోడలికి అరుదైన గౌరవం..!

Wed Jun 23 2021 22:11:34 GMT+0530 (IST)

Wilderness Preservation Organisation picks Upasana as its Ambassador

సినీ హీరోల భార్యలు కూడా ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ అయిపోతున్నారు. ఇదివరకు జనరేషన్ లో సినీ హీరోల భార్యలు అంటే అసలు బయటకి కనిపించేవారు కాదు. కేవలం సినిమా వేడుకల్లో లేకపోతే ఫ్యామిలీ ట్రిప్స్.. ఫ్యామిలీ ఫంక్షన్స్ లో మాత్రమే దర్శనమిచ్చేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి పూర్తిగా పోయింది. కొందరు తప్ప మిగతా స్టార్ హీరోస్ నుండి జూనియర్ హీరోస్ వరకు అందరి భార్యలు సోషల్ మీడియాలో ఖాతాలు తెరిచి అప్డేట్ లో ఉంటున్నారు. హీరోలు ఇవ్వలేని ఇన్ఫర్మేషన్ వారి భార్యలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలుపుతున్నారు.అయితే మెగాఫ్యామిలీ కోడలు.. మెగాపవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన.. గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఈమె ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉండే సెలబ్రిటీ వైఫ్స్ లో ముందుంటారు. అలాగే సోషల్ ఆక్టివిటీస్ లో ఎక్కువగా పాల్గొంటూ ఆమె సారథ్యంలో సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అలాగే కరోనా సమయంలో ఎంతోమంది పేదలకు వైద్యం పరంగా ఆర్థికంగా సాయం చేస్తూ తన మానవతా దృక్పధం చాటుకున్నారు. అయితే ఉపాసన గొప్ప అనిమల్ లవర్. అందుకే అప్పుడప్పుడు అడవుల్లో కూడా జంతువుల గురించి కేర్ తీసుకుంటూ ఉంటారు.

తాజాగా ఆమెను ఓ అరుదైన బాధ్యత వరించింది. ప్రస్తుతం ఉపాసన ఫ్యామిలీ బాధ్యతలతో పాటు తమ అపోలో హాస్పిటల్స్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తుంది. అలాగే సోషల్ మీడియా ద్వారా ఆరోగ్యపరమైన సూచనలు చిట్కాలు కూడా అందజేస్తుంటుంది. తాజాగా ఉపాసన వరల్డ్ వైల్డ్ లైఫ్ (WWF) ఇండియా.. అసోసియేషన్ తరపున ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోస్ అనే కార్యక్రమానికి ప్రచారకర్తగా నియమితురాలు అయ్యారు. ఈ మధ్యకాలంలో వన్యప్రాణుల సంరక్షణలో ఎంతో పాటుపడుతున్న ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోస్ కష్టం గురించి ఆమె మాట్లాడింది. అలాగే తనకు దక్కిన గౌరవం పై స్పందించి.. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక అయినందుకు తాను ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు ట్విట్టర్ లో తెలిపారు.