క్లిక్ క్లిక్ : హనీమూన్ లో స్టార్ కపుల్

Sat Aug 13 2022 11:02:02 GMT+0530 (IST)

WikkiNayan in Honeymoon

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార మరియు విఘ్నేష్ శివన్ లు సుదీర్ఘ కాలం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. వీరి పెళ్లి కి సంబంధించిన డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ ద్వారా తీసుకు వచ్చారు. పెళ్లి గురించిన హడావుడి మీడియా కు ఎక్కువగా రివీల్ చేయలేదు. కాని ఇప్పుడు పెళ్లి కి సంబంధించిన వీడియోను డాక్యుమెంటరీగా విడుదల చేయడంతో అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.మరో వైపు నయనతార మరియు విఘ్నేష్ శివన్ లు ప్రత్యేక విమానంలో స్పెయిన్ వెళ్లారు. హనీమూన్ ప్లాన్ చేసిన కొత్త జంట దాదాపు రెండు వారాల పాటు స్పెయిన్ లో ఉంటారని సమాచారం అందుతోంది.

నయనతార మరియు విఘ్నేష్ లు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. హనీమూన్ కి వెళ్తున్నట్లుగా విఘ్నేష్ శివన్ పోస్ట్ ను చూస్తుంటే అర్థం అవుతోంది.

నయనతార మరియు విఘ్నేష్ శివన్ లు సుదీర్ఘ కాలం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత విఘ్నేష్ శివన్ మరియు నయనతార పలు సార్లు ట్రెడీషనల్ లుక్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. వీరిద్దరి జోడీ గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నట్లుగా సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

తమిళంతో పాటు తెలుగు లో కూడా వరుసగా సినిమాల్లో నటిస్తున్న నయనతార పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో వరుసగా నటించేందుకు గాను డేట్లు ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

హీరోయిన్ గా నయనతార సౌత్ లోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా పేరు ను దక్కించుకుంది. ఇక విఘ్నేష్ శివన్ తో కలిసి బ్యానర్ ను ఏర్పాటు చేసి సినిమాల నిర్మాణం కూడా చేస్తున్న విషయం తెల్సిందే. విఘ్నేష్ శివన్ దర్శకుడిగా ఇప్పుడిప్పుడే బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు.