ఈ సినిమా ఎందుకు తీసినట్లు?

Mon Mar 01 2021 05:00:02 GMT+0530 (IST)

Why was this movie taken?

నిన్నిలా నిన్నిలా అని ఓ సినిమా. తమిళ తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కింది. తమిళంలో ఓ మై కడవులే సహా మంచి మంచి సినిమాలు చేసిన అశోక్ సెల్వన్ హీరో. అతడి సినిమాలు కొన్ని తెలుగులోనూ అనువాదం అయ్యాయి. అయినా అశోక్ మనవాళ్లకు పెద్దగా తెలియదనే అనుకోవాలి. కానీ ఇందులో కథానాయికలుగా నటించిన నిత్యామీనన్ రీతూ వర్మ మన దగ్గర బాగా పాపులర్. ఈ చిత్రాన్ని నిర్మించిందేమో సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్. సినిమాను పూర్తి చేసిన నేరుగా ఓటీటీ రిలీజ్‌కు ఇచ్చేశారు. ఐతే ఇలా ఒక సినిమా తెరకెక్కిందన్న సంగతే మన జనాలకు పెద్దగా తెలియదు. దాన్ని సరిగా ప్రమోట్ చేయలేదు. ఇంతకుముందు ఏమో కానీ.. కనీసం సినిమాను రిలీజ్ చేస్తున్నపుడైనా కొంచెం ప్రచారం చేయాల్సింది. ఒక ఈవెంట్ అయినా పెట్టాల్సింది. కానీ మొక్కుబడిగా ఓ ప్రెస్ మీట్ పెట్టి వదిలేశారు.మొన్న శుక్రవారం ఈ చిత్రాన్ని జీ ప్లెక్స్‌లో నేరుగా రిలీజ్ చేశారు. దానికి పే పర్ వ్యూ పద్ధతిలో టికెట్ కూడా పెట్టారు. ఐతే సరైన ప్రమోషన్ లేదు. ఈ సినిమా రిలీజవుతున్నట్లే జనాలకు తెలియదు. ఇలా రిలీజ్ చేసి ఏం లాభమో మేకర్స్‌కే తెలియాలి. ఈ వారం అందరి దృష్టీ నితిన్ మూవీ చెక్ మీద ఉంది. అక్షర కూడా కొంత మేర జనాలను ఆకర్షించింది. కానీ నిన్నిలా నిన్నిలా అనే ఒక సినిమా రిలీజైన సంగతే జనాలకు తెలియని పరిస్థితి. మంచి కాంబినేషన్లో సినిమా తీసి సరిగా ప్రమోట్ చేయకపోవడమేంటో అర్థం కాని విషయం. ఇదసలు తెలుగు సినిమా అన్న ఫీలింగ్ కూడా ప్రేక్షకుల్లో లేదు. అని శశి అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా పర్వాలేదనే అంటున్నారు చూసిన వాళ్లు. ఇదొక డిఫరెంట్ అటెంప్ట్ అని చెబుతున్నారు. రివ్యూలు కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడైనా కొంచెం ప్రమోట్ చేసి సినిమాను జనాల్లోకి తీసుకెళ్తారేమో చూడాలి.