'గాడ్ ఫాదర్' సెట్ లో ఆ డైరెక్టర్ ఎందుకు భయపడ్డాడు?

Mon Sep 26 2022 13:15:56 GMT+0530 (India Standard Time)

Why was the director so scared on the sets of 'Godfather'?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గాడ్ ఫాదర్'. మలయాళ హిట్ ఫిల్మ్ 'లూసీఫర్' దీనికి ఆధారం. అక్టోబర్ 5న భారీ స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చిరు ఈ ప్రాజెక్ట్ పై ఫుల్ కాన్ఫిడెంన్స్ తో కనిపించడం విశేషం. మోహన్ రాజా డైరెక్షన్ లో కొణిదెల ప్రొడక్షన్స్ సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లు ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించాయి.బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రలో నటించారు. లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ నయనతార యంగ్ హీరో సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించారు. అత్యంత భారీ స్థాయిలో చిరు కెరీర్ లోనే తొలిసారి హీరోయిన్ డ్యూయెట్స్ లేకుండా చేసిన సినిమా ఇది. అయినా సినిమా చూస్తున్న ప్రేక్షకులకు అభిమానులకు అవేవీ గుర్తు రావడని అంతు అద్భుతంగా కథలో లీనం చేస్తూ సినిమాని దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించారని మెగాస్టార్ ఫుల్ కాన్ఫిడెన్ప్ తో చెబుతున్నారు.

అంతే కాకుండా రీసెంట్ గా విడుదల చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చిరు దర్శకుడు పూరి గజన్నాథ్ కు ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. ప్రస్తుతం దీనిపై చర్చే జరుగుతోంది. పూరికి చిరు ఇంత ఎలివేషన్ ఎందుకు ఇస్తున్నాడని అంతా ఆశ్యర్యపోతున్నారు. ఈ మూవీలో పూరి జగన్నాథ్ జర్నలిస్ట్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో చిరు పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించడం విశేషం. ఈ పాత్రలో నటించడానికి ముందు పూరి జగన్నాథ్ అంగీకరించలేదని ఈ పాత్రలో చచ్చినా చేయనన్నారని వెల్లడించారు.

ఇక సెట్ లో మొదటి రోజు ఫస్ట్ షాట్ కోసం పూరి కెమెరా ముందుకు రావడానికి ఎంతలా వణికిపోయారో వెల్లడించి షాకిచ్చారు. ఫస్ట్ డే సెట్ లో షూట్ కి రావడానికి పూరి భయంతో వణికిపోయారట. కారవాన్ నుంచి బయటికి రావడానికి తెగ ఇబ్బందిపడ్డారట. ఫైనల్ గా అంతా ఎదురుచూస్తున్న వేళ కారవాన్ నుంచి తనదైన మార్కు స్టైల్ తో సిగరేట్ కాలుస్తూ.. టీ గ్లాస్ తో పూరి మొత్తానికి బయటికి వచ్చారట. తనదో పాటు సెట్ లోకి ఛార్మీ కూడా ఎంట్రీ ఇచ్చిందట.

పూరి ఎందుకింత ఆలస్యంగా కారవాన్ నుంచి బయటికి వస్తున్నాడని ఛార్మీని చిరు అడిగారట. దానికి ఛార్మీ షాకింగ్ విషయాన్ని బయటపెట్టందట. 'తను బయటికి రావడానికి షూటింగ్ చేయడానికి చాలా భయంతో వణికిపోతున్నాడని షూటింగ్ లో పాల్గొనాలని తనకు లేదని అసలు విషయం బయటపెట్టిందట. అయితే అంతలా భయపడిన పూరి కెమెరా ముందుక వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి చిరుతో పాటు అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడట.

పూరికి చిరు ఇచ్చిన ఎలావేషన్ చూసిన వాళ్లంతా 'గాడ్ ఫాదర్'లో పూరి ఎలా నటించాడా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'గాడ్ ఫాదర్' ఆక్టోబర్ 5న దసరా కు భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ తన మార్కు సాంగ్స్ డ్యాన్సులు హీరోయిన్ లేకుండా చేస్తున్న ఈ సప్రయోగం ఎంత వరకు ఫ్యాన్స్ ని సంతృప్తి పరుస్తుందో తెలియాలంటే మరో పది రోజులు వేచి చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.