స్వరా భాస్కర్ ను ఎందుకు శిక్షించారు.?

Sun Nov 28 2021 17:00:01 GMT+0530 (IST)

Why was Swara Bhaskar punished

బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు. అప్పట్లో ఎవరికి భయపడక తన మదిలోని మాటను బాహాటంగా చెప్పినందుకు స్వరా భాస్కర్ తో కాంట్రాక్టులు రద్దు చేశారట..తన వాక్ స్వాతంత్ర్యాన్ని వాడుకున్నందుకు శిక్షింపబడాల్సి వచ్చిందట..కొన్నాళ్ల క్రితం మోడీప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ ఎన్ఆర్సీ చట్టాల గురించి ప్రస్తావిస్తూ స్వరాభాస్కర్ తన ఆవేదన వ్యక్తం చేసింది.  ఆ రెండు చట్టాలకు వ్యతిరేకంగా నా ఒపినీయన్ తెలియజేసినందుకు నాకు తగిన శాస్తి జరిగిందని స్వర భాస్కర్ బాధపడింది.

ఆ వ్యాఖ్యల తర్వాత స్వరతో చాలా కమర్షియల్ బ్రాండ్స్ కాంట్రాక్టులు రద్దు చేసుకొని షాక్ ఇచ్చాయి. ప్రభుత్వం తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా స్వర నిరసనల్లో పాల్గొంటూ తమ ప్రొడక్టులకు చెడ్డ పేరు తెస్తోందని ఆయా బ్రాండ్స్ వారు తమ కాంట్రాక్టులను రద్దు చేసుకున్నారట..

అయితే స్వర భాస్కర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ దేశంలోని రాజ్యాంగబద్దమైన విలువల కోసం తనను ఎవరు ఎలా శిక్షించినా వెనకడుగు వేయనని స్వరా భాస్కర్ స్పష్టం చేశారు. తాను నమ్మిన దానికోసం ఎలాంటి శిక్షకైనా రెడీ అని బాలీవుడ్ బ్యూటీ పేర్కొంది.