Begin typing your search above and press return to search.

స్పోర్ట్స్ స్టార్స్ అంటే హీరోయిన్స్ కి మంచి క్రేజ్

By:  Tupaki Desk   |   8 April 2020 10:30 PM GMT
స్పోర్ట్స్ స్టార్స్ అంటే హీరోయిన్స్ కి మంచి క్రేజ్
X
ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎలా పుడుతుందో తెలియదు.. కానీ పుడుతుంది.అయితే రెండు భిన్న రంగాల మధ్య ప్రేమ చిగురించడమే కాదు.. పరిణయానికి దారితీసింది. దేశంలోనే పాపులర్ సినిమా - క్రీడా రంగంలోని వారు పెళ్లి చేసుకోవడం ఒక హాట్ టాపిక్.

దేశంలో స్పోర్ట్స్ స్టార్స్ అంటే హీరోయిన్స్ పడి చస్తున్నారు. వారితో ప్రేమతో మొదలుపెట్టి పెళ్లి వరకూ తీసుకెళ్లి మూడు ముళ్లు వేసుకుంటున్నారు. వరుసగా క్రీడాకారులను చేసుకుంటున్న తారల తళకు బెళుకులు ఇప్పుడు చూద్దాం..

*విరాట్-అనుష్క ప్రేమ పెళ్లి

2013లో ఓ షాంపు యాడ్ విరాట్ కోహ్లీ - అనుష్క శర్మలను కలిపింది. దాన్నుంచి ప్రేమ పుట్టింది. 2017లో ఇటలీ లో ఈ జంట పెళ్లితో ఒక్కటైంది. ఇప్పటికీ దేశంలో ఎవర్ గ్రీన్ సినిమా-క్రీడా ప్రేమ జంటగా వీరిద్దరికి పేరుంది. విరాట్ ను చేసుకున్నాక అనుష్క సినిమాలు కూడా తగ్గించేసింది.

*యువీతో విదేశీ సినీ తార

భారత డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ తో ప్రేమలో పడింది హాలీవుడ్ నటి హాజెల్ కీచ్. వీరి ప్రేమ 2015లో బాలీలోని బీచ్ లో ఎంగేజ్ మెంట్ తో గట్టిపడింది. 2016లో పెళ్లితో బంధం బలపడింది.

*జహీర్ ఖాన్ ను పెళ్లాడిన సాగరికా

చక్ దే ఇండియాలో నటించిన ప్రీతీ సబర్వాల్ ఇండియన్ మోడల్ తోపాటు జాతీయ స్థాయి అథ్లెట్. ఈమె 2017లో ఏప్రిల్ 24న భారత బౌలర్ జహీర్ ఖాన్ ను వివాహం చేసుకుంది. చాలా కాలం గుట్టుగా సాగిన వీరి ప్రేమాయణం చివరకు నిశ్చితార్థం - పెళ్లితో సుఖాంతమైంది.

*బజ్జీ +గీతా బాస్రా

హర్భజన్ సింగ్ కూడా బల్లే బల్లేగా ప్రేమలో పడిపోయాడు. 2015లో అతడు గీతా బాస్రాతో వివాహ బంధంతో ఒక్కటయ్యాడు. కొన్నేళ్లుగా ప్రేమించుకున్న వీరి విషయం ఎవరికి తెలియదు.. వీరికి హీనాయ అనే కుమార్తె కూడా ఉంది.

*అజారుద్దీన్ - సంగీత బిజ్లానీ ప్రేమ..

భారత క్రికెట్ జట్టుకు 90వ దశకంలో కెప్టెన్ గా చేసిన అజారుద్దీన్ ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ సంగీత బిజ్లానీతో ప్రేమలో పడిపోయాడు. వీరిద్దరూ 1996లో పెళ్లి చేసుకున్నారు. ఇక 2010లో ఈ జంట విడాకులతో విడిపోవడం విశేషం.