'విజయ్ - వంశీ పైడిపల్లి' ప్రాజెక్ట్ ని ఎందుకు ప్రకటించలేదంటే..!

Wed Jun 23 2021 09:00:01 GMT+0530 (IST)

Why the Vijay Vamsi Paidipally project was not announced

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ 47వ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. వారి ఆనందాన్ని రెట్టింపు చేయడానికి విజయ్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. విజయ్ తన 65వ చిత్రం ''బీస్ట్''(మృగం) టైటిల్ తో పాటు రెండు ఫస్ట్ లుక్ లను విడుదల చేసి ఖుషీ చేశాడు. ఈ క్రమంలో విజయ్ టాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వస్తుందని ఫ్యాన్స్ ఆశించారు. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి అనౌన్స్ మెంట్ రాకపోవడంతో కాస్త నిరాశ చెందినట్లు తెలుస్తోంది.'మహర్షి' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వంశీ పైడిపల్లి.. విజయ్ తో ఓ సినిమా ప్లాన్ చేశారు. దిల్ రాజు ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వంశీ పైడిపల్లి ఈ ప్రాజెక్ట్ ను కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే ఆయన విజయ్ కు స్టోరీ వినిపించి మెప్పించడం.. దిల్ రాజు అడ్వాన్స్ చెల్లించడం జరిగిపోయాయని సమాచారం. ఈ నేపథ్యంలో విజయ్ బర్త్ డే స్పెషల్ గా అనౌన్స్ మెంట్ వస్తుందని అందరూ భావించారు.

అయితే సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తమిళ సూపర్ స్టార్ కు వంశీ పైడిపల్లి - దిల్ రాజు.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినప్పటికీ సినిమా గురించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు. దీంతో అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించకపోవడానికి కారణం.. విజయ్ తదుపరి సినిమా ఏదనే క్లారిటీ లేకపోవడమని తెలుస్తోంది. ఇళయ దళపతి ప్రస్తుతం వంశీ పైడిపల్లి సినిమాతో పాటుగా లోకేష్ కనగరాజ్ తో ఓ సినిమా కమిట్ అయ్యారు. వీటిలో వంశీ చిత్రాన్ని విజయ్ #Thalapathy66 లేదా #Thalapathy67 గా చేస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో అనౌన్స్ మెంట్ ఇవ్వలేదని టాక్ నడుస్తోంది