డైరెక్టర్ కి ఈ తలనొప్పులు ఎందుకో..?

Sat Apr 01 2023 05:00:02 GMT+0530 (India Standard Time)

Why is The Star Director Taking Up This Headache?

ఒక సినిమా డైరెక్టర్ అంటే సినిమా కథ రాసిన దగ్గర నుంచి సినిమా రిలీజ్ వరకు ఆయనకు ఉండే టెన్షన్ బోలెడన్ని ఉంటాయి. సినిమా తీయడంలో అతని కాన్సెంట్రేషన్ ఎక్కడ తేడా కొట్టినా ఆ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే టాలీవుడ్ లో ఒక డైరెక్టర్ బిజినెస్ వ్యవహారాలను చూస్తూ డైరెక్టర్ గా ట్రాక్ తప్పుతున్నాడని టాక్. రైటర్ గా వరుస సక్సెస్ లను అందుకున్న అతను డైరెక్టర్ గా మారాక కూడా ఆ సక్సెస్ మేనియా కొనసాగించాడు. అయితే ఒక మెగా మూవీతో అతనికి ఇప్పటిదాకా ఉన్న హిట్ ట్రాక్ కాస్త డిస్టర్బ్ అయ్యింది.ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలతో ఆయన చేసిన ప్రయత్నం విఫలమైంది. ఆ సినిమా ఫెయిల్యూర్ తాలూకా భారమంతా ఆ డైరెక్టర్ మీదే పడింది. అయితే ఆ షాక్ నుంచి కోలుకుని ఎలాగోలా మరో టైగర్ లాంటి హీరోతో సినిమా ఓకే చేసుకున్నాడు సదరు డైరెక్టర్.

అంతకుముందు ఆ హీరోతో సూపర్ హిట్ ఇచ్చిన రికార్డ్ ఉంది కాబట్టి ఆ హీరో కూడా ఈ డైరెక్టర్ మీద భారీ హోప్స్ పెట్టుకున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కే ఈ సినిమా విషయంలో డైరెక్టర్ కేవలం సినిమా దర్శకత్వమే చేయకుండా బిజినెస్ విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారట.

చేస్తున్న సినిమాలో తన స్నేహితుడు నిర్మాతగా ఉన్న కారణంగా ఆ బాధ్యత కూడా తన మీద వేసుకున్న డైరెక్టర్ సినిమా మేకింగ్ కన్నా బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడని తెలుస్తుంది. అయితే ఇది కచ్చితంగా సినిమా మీద ఎఫెక్ట్ పడుతుందని ఆ హీరో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

డైరెక్టర్ గా ముందు సినిమా అంచనాలను అందుకునేలా తీసి ఆ తర్వాత బిజినెస్ వగైరా లాంటివి సెట్ చేయొచ్చు. కానీ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే డైరెక్షన్ కన్నా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే సినిమా కిచిడీ అవుతుంది.

అసలే ఒక్క సినిమాతో చాలా బ్యాడ్ నేమ్ తెచ్చుకున్న ఈ డైరెక్టర్ చేస్తున్న సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి డైరెక్టర్ సినిమా మీద కన్నా బిజినెస్ సెట్టింగ్స్ చేయడం ఈ ఒక్క సినిమాకే కాదు అతని కెరీర్ కి కూడా అంత మంచిది కాదని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.