Begin typing your search above and press return to search.

సమంత సౌండ్ చెయ్యడం లేదేంటి..?

By:  Tupaki Desk   |   17 Aug 2022 1:30 PM GMT
సమంత సౌండ్ చెయ్యడం లేదేంటి..?
X
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే హీరోయిన్లలో సమంత రూత్ ప్రభు ముందు వరుసలో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ & ట్విట్టర్ లలో మిలియన్ల కొలదీ ఫాలోవర్స్ కలిగివున్న సామ్.. రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ ఉంటుంది. ఈ క్రమంలో పెయిడ్ పోస్టులతో సొమ్ము చేసుకుంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఆమె తన ఇన్స్టాగ్రామ్ యాక్టివిటీని తగ్గించినట్లు కనిపిస్తోంది.

సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తున్న సామ్ వ్యక్తిగత జీవితంలో గత ఏడాది కాలంలో ఎన్నో సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ హీరో అక్కినేని నాగచైతన్య నుంచి విడిపోయింది. అయినప్పటికీ ఆమె సోషల్ మీడియాకు దూరమవ్వలేదు. ఎప్పటిలాగే తరచుగా పోస్టులు పెడుతూ తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ వచ్చింది.

నిఘాడ అర్థం వచ్చేలా స్టోరీలు పెట్టడమే కాదు.. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో ఇంటర్నెట్ లో హీట్ పుట్టించింది. నిత్యం ఏదొక పోస్ట్ షేర్ చేస్తూ ఉంటే సమంత.. ఇటీవల కాలంలో ఇన్స్టాగ్రామ్ లో పెద్దగా కనిపించడం లేదు. అప్పుడప్పుడు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ కు సంబంధించి పెయిడ్ పోస్టులు మాత్రమే పెడుతోంది. స్టోరీలలో కేవలం బర్త్ డే విషెస్ లు పెడుతూ వస్తోంది.

అయితే ఇన్స్టా వాడకాన్ని తగ్గించిన సమంత.. అప్పుడప్పుడు ట్విట్టర్‌ ని ఉపయోగిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఆమె సోషల్ మీడియాలో కాకుండా.. కెరీర్ మీదనే ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌ కు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని అర్థమవుతుంది.

ఇక సినిమాల విషయానికొస్తే.. సమంత ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' సినిమా షూటింగ్ పూర్తి చేసింది. అలానే 'యశోద' అనే పాన్ ఇండియా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీని రిలీజ్ కు రెడీ చేస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన 'ఖుషి' అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

సామ్ తమిళ్ లో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తో ఓ ప్రాజెక్ట్ కమిట్ అయింది. విజయ్ - శివ కార్తికేయన్ వంటి హీరోలతో సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. 'అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్' అనే హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఆమె చేతిలో ఉంది.

'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్-2 సిరీస్ తో నార్త్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన సమంత.. ఇప్పుడు బాలీవుడ్ లో పాగా వేయాలని ప్రణాళికలు రచిస్తోంది. హీరోయిన్ తాప్సీ పన్నూ నిర్మించే ఓ హిందీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటించనుంది. వరుణ్ ధావన్ తో కలిసి ఓ హిందీ వెబ్ సిరీస్ చేయనుంది. ఇవే కాకుండా మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ త్వరలోనే రానున్నాయి.