సరిలేరు టీమ్ సైలెంట్ అయ్యిందేం?

Thu Jan 30 2020 22:00:01 GMT+0530 (IST)

Why Sarileru Neekevvaru Team Silent

`సరిలేరు నీకెవ్వరు` టీమ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతే... అల వైకుంఠపురములో టీమ్ మాత్రం పార్టీల పేరుతో సెలబ్రేట్ చేస్తోంది. సంక్రాంతి బరిలో పోస్టర్లతో ఆధిపత్యం చూపించాలనుకున్నా జెన్యూనిటీకే చివరికి జనం పట్టంగట్టారు. అల వైకుంఠపురములో టీమ్ ఇండస్ట్రీ హిట్టు.... నాన్ బాహుబలి రికార్డ్ అంటూ పార్టీలతో చెలరేగుతుండడంతో సరిలేరు టీమ్ కు ఇప్పుడు సౌండ్ లేదు. ఎందుకనో చివరిగా తెలుగు స్టేట్స్ వరకూ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అంటూ ప్రకటించి ఆ తర్వాత ఒక్కసారిగా మౌనం వహించారు. తాజాగా ఈ రెండు సినిమాలకు సంబంధించి బాక్సాఫీస్ పోరులో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.అల వైకుంఠపురములో ఇప్పటికే అన్ని చోట్లా లాభాల పంట పండిస్తుంటే.. సరిలేరు నీకెవ్వరు మాత్రం అమెరికా డిస్ట్రిబ్యూటర్లకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. అక్కడ లాభాల మాట దేవుడెరుగు పెద్ద లాస్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ప్రీమియర్ షోలతో హడావుడి చేసినా సరైన టైమ్ లో సరిలేరుకి గట్టి దెబ్బే తగిలిందని చర్చ సాగుతోంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించినా ఒకటి రెండు చోట్ల పంపిణీ వర్గాలకు లాస్ వచ్చిందని ట్రేడ్ చెబుతోంది. ఈ కారణంగానే సరిలేరు టీమ్ ఒక్కసారిగా ప్రచారం చేయడంలో చల్లబడిందనేది ఫిలిం వర్గాలు చెబుతున్న మాట. అటు అల వైకుంఠపురములో టీమ్ సక్సెస్ దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు మీడియా మీట్లతో సక్సెస్ సంతోషాన్ని షేర్ చేసుకోవడమే గాక.. ఇకపై సక్సెస్ పార్టీలతో చెలరేగుతోంది.

ఓ మీడియా సమావేవంలో అల డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లు అందరికీ గ్రాండ్ గా పార్టీ ఇస్తానని బన్నీ అన్నారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటున్నాడు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ దసపల్లాలో గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేసారు. ఈ పార్టీకి పంపిణీవర్గాలు.. ఎగ్జిబిటర్లు సహా ఫిల్మ్ మీడియా ఎటెండ్ కానుంది. నాన్ బాహుబలి కేటగిరీ లో ఇండస్ట్రీ హిట్!! అంటూ రేపు పార్టీలో సందడి పీక్స్ లో ఉంటుందనడం లో సందేహమేం లేదు. ఆ మేరకు ఇప్పటికే సోషల్ మీడియా లో ప్రచారం మొదలు పెట్టారు. మొత్తానికి 2020 సంక్రాంతి బన్నీదే అనడంలో సందేహమేం లేదన్న చర్చా సాగుతోంది.