రౌడీ స్టార్ పై భామల్లో ఎందుకంత క్రేజ్?

Thu Dec 05 2019 16:02:18 GMT+0530 (IST)

Why Rowdy Has That Much Craze In Heroines

విజయ్  దేవరకొండ అనూహ్యాంగా టాలీవుడ్ లోకి దూసుకొచ్చిన యువతరంగం. హీరోగా నటించింది ఎనిమిది సినిమల్లోనే అయినా.. అందులో రెండే రెండు బ్లాక్ బస్లర్లు (అర్జున్ రెడ్డి-గీతగోవిందం) అతడి ఫేట్ ని మార్చేశాయి.  అర్జున్ రెడ్డి అతడికి రౌడీ స్టార్ ఇమేజ్ ని ఇచ్చింది. ఆ ఇమేజ్ విజయ్ కెరీర్ నే టర్న్ చేసిందని చెప్పాలి. అర్జున్ రెడ్డి ఇతర భాషల్లోకి రీమేక్ అవుతూ అతడి స్థాయిని ఇంకా పెంచేస్తోంది. బాలీవుడ్  కోలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ ల గురించి జనాల్లో వైరల్ గా ప్రచారమైంది. ఆ క్రమంలోనే గాళ్స్ లోనూ అతడి క్రేజు  రెట్టింపైంది.ఇప్పటికే శ్రీదేవి తనయ జాన్వీ కపూర్.. కియారా అద్వాణి.. శ్రద్దా కపూర్.. రష్మిక మందన లాంటి భామలు విజయ్ అంటే ఇష్టమని.. తనతో కలిసి ఓ సినిమా  చేయాలని ఉందని బాహాటంగా తెలిపారు. తాజాగా ఆ లిస్ట్ లో  అలియాభట్ కూడా చేరిపోయింది. విజయ్ స్టైల్ అంటే తనకు విపరీతమైన ఇష్టమని అతడి నేచురాలిటీకీ ప్లాట్ అయిపోయానని ఓ ఇంటర్వూలో తెలిపింది. అమితాబచ్చన్ తర్వాత తనకు ఇష్టమైన స్టార్ ఆ యంగ్ హీరో మాత్రమేనని అంది. జాన్వీ కపూర్- కియారా కూడా అర్జున్ రెడ్డిలో తన స్టైల్ ఎంతో బాగుంటుందని...నేచురల్ పెర్పామెన్స్ తో మెప్పిస్తాడని పొగిడేసిన సంగతి తెలిసిందే.

ఇక రష్మిక మందన- విజయ్ స్నేహం గురించి చెప్పాల్సిన పనిలేదు. గీతగోవిందం విజయంతో ఆ కాంబో టాలీవుడ్ లో క్రేజీ గా మారిపోయింది. తర్వా త ఇద్దరు డేటింగ్ లో ఉన్నారన్న ప్రచారం సాగింది. అయితే ఇలా ఓ  టాలీవుడ్ హీరోని ఇంత మంది హీరోయిన్లు..అదీ బాలీవుడ్ హీరోయిన్లు ఇష్టపడటం అనేది ఇప్పటివరకూ జరగలేదు. బాహుబలి  తర్వాత ప్రభాస్ అంటే  కొంతమంది బాలీవుడ్ భామల్లో క్రష్ ఉంది కానీ విజయ్ ఫాలోయింగ్ ఇంచుమించు అలానే  ఉంది. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలి గాని విజయ్ సరసన నటించడానికి హీరోయిన్లు క్యూ కట్టడం ఖాయం. అలాగే ఓ హీరో పై  ఇష్టాన్ని ఇలా బాహాటంగా తెలపడం సంచలనం అనే చెప్పాలి