ఏమైంది రాజా ప్రమోషన్లు ఎందుకు చేయట్లేదు?

Sat Apr 01 2023 10:37:03 GMT+0530 (India Standard Time)

Why Raviteja No Promotions For Ravanasura

గతేడాది రవితేజ 'ధమాకా' సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టిన మాస్ మహారాజా రవితేజ... ఈ ఏడాది ఓపెనింగ్ కూడా హిట్టు తోనే మొదలెట్టాడు. బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచిన వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించి మంచి మార్కులే కొట్టేశాడు. చివరి రెండు చిత్రాలు మంచి హిట్లుగా నిలవగా... ఇప్పటి వరకు తన తర్వాతి చిత్రం రాలేదు.



అయితే ధమాకా సినిమా అంత పెద్ద హిట్టవడానికి కారణం అందులోనే పాటలు. అలాగే శ్రీలీల కూడా. తన అందం అభినయంతో అధ్భుతంగా నటించి సినిమా హిట్టయ్యేందుకు చాలా కష్టపడింది. అయితే వచ్చే వారం అంటే ఏప్రిల్ 7వ తేదీన రవితేజ రావణాసుర చిత్రం విడుదల కాబోతుంది. కానీ ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన పాటలు కానీ ప్రమోషన్లు కానీ మొదలు పెట్టలేదు చిత్రబృందం.

రావణాసుర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు ఉండగా... శ్రీలీల రేంజ్ హీరోయిన్ లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనీసం వాళ్లయినా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్తే బాగుంటుందని చెబుతున్నారు.

పాటలు బాగాలేక ప్రమోషన్లు చేయకపోతే సినిమా పరిస్థితి ఏంటని అనుకుంటున్నారు. ఈ చిత్రంలో అక్కినేని హీరో సుశాంత్ రావణాసుర విలన్ పాత్రలో రావు రమేశ్ మురళీ శర్మ సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

మరోవైపు చమ్కీల అంగీలేసి దూం దాం దోస్తాన్ ఇరగ మరగ చేద్దాం  వంటి పాటలతో పాటు నాని దూకుడు ప్రమోషన్ల కారణంగా దసరా సినిమా ప్రేక్షకుల్లో భారీ బజ్ ను క్రియేట్ చేసింది. ప్రేక్షకులందిరినీ థియేటర్ కు రప్పించడంలో దసరా చిత్రబృందం సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. హీరోహీరోయిన్ల దేశవ్యాప్తంగా ప్రమోషన్లు చేశారు. ఈ క్రమంలోనే సినిమా కూడా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది.

కానీ రావణాసుర కోసం రవితేజ కానీ అందులోని హీరోయిన్లు కానీ ఏమాత్రం ప్రమోషన్లు చేయట్లేదు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ యే విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నారు. ట్రైలర్కి ఇప్పటికే పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. మరి రవితేజ ఈ సినిమాకు ఎలా హైప్ తెస్తాడనేది ఆసక్తికరంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.