సాహో లేట్ కి ఇదా కారణం ?

Wed Jul 17 2019 20:00:01 GMT+0530 (IST)

Why Prabhas Saaho Movie Release Delay

డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశలో ముంచెత్తుతూ సాహో విడుదల వాయిదా పడిందన్న వార్త తాలూకు షాక్ నుంచి వాళ్లింకా బయటికి రావడం లేదు. నిజానికి యువి నుంచి అఫీషియల్ నోట్ రాకపోయినప్పటికీ మిగిలిన సినిమాల అనౌన్స్ మెంట్ దీన్ని చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. కొత్తగా ప్రచారంలోకి వచ్చిన ఆగస్ట్ 30 కూడా గ్యారెంటీ లేదని ఫ్రెష్ అప్ డేట్. దీనికి కారణం అందరూ ఈజీగా ఊహించగలిగేదే. విజువల్ ఎఫెక్ట్స్.తొలుత ముంబైలో చేపట్టిన పనులు తరువాత బెంగుళూరుకు షిఫ్ట్ చేశారట. అయితే నిపుణుల కొరతతో పాటు ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల టీమ్ ఇక్కడికి రావడంలో ఆలస్యం జరగడంతో ఫైనల్ గా విడుదల తేదీని మీట్ కాలేమని నిర్మాతలకు అర్థమైందట.ఇది చాలదు అన్నట్టు సాహో బీజీఎమ్ కోసం జిబ్రాన్ కాస్త ఎక్కువ టైం అడిగాడట. ఒత్తిడి మీద చేస్తే క్వాలిటీలో తేడా రావోచ్చనే ఉద్దేశంతో దర్శకుడు సుజిత్ కూడా తొందరపడకుండా చేయమని చెప్పినట్టు తెలిసింది.

వీటితో పాటు ఐదు భాషల్లో ఏకకాలంలో విడుదల కాబట్టి డబ్బింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. జంతువులు నటించిన సినిమాలకే పెద్ద స్టార్లు పోటీ పడి మరీ గొంతులు ఇస్తున్నారు. అలాంటప్పుడు సాహోని ఆషామాషీగా చేయలేరుగా. కర్ణుడి చావుకు ఎన్నో కారణాలు అన్నట్టు ఇప్పుడు సాహో వాయిదాకు అంతకంటే ఎక్కువ రీజన్సే కనిపిస్తున్నాయి. ఇదంతా ఓకే కానీ ఇకనైనా వీలైనంత త్వరగా సాహో కొత్త డేట్ చెప్పాలని అభిమానుల డిమాండ్. అసలు వాయిదా పడిందనే చెప్పలేదు ఇక దీనికి ఎంత టైం తీసుకుంటారో