Begin typing your search above and press return to search.

ప్రభాస్.. యూవీని ఎందుకు వదిలేసాడు?

By:  Tupaki Desk   |   29 May 2023 2:00 PM GMT
ప్రభాస్.. యూవీని ఎందుకు వదిలేసాడు?
X
పాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్ గా తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ ఎలాంటి సినిమా స్టార్ట్ చేసిన కూడా భారీ స్థాయిలోనే అంచనాలను క్రియేట్ చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం అతను లైన్ లో పెట్టినన్ని అతిపెద్ద సినిమాలను ఏ హీరో కూడా సెట్ చేయడం లేదు అని చెప్పాలి. అందరి కంటే ఎక్కువ స్థాయిలో మార్కెట్ క్రియేట్ చేసుకుంటూ వెళుతున్న ప్రభాస్ రాబోయే రోజుల్లో మరిన్ని సర్ ప్రైజ్ లు ఇవ్వబోతున్నట్లు అర్థమవుతుంది.

అయితే మిర్చి సినిమా నుంచి యూవీ క్రియేషన్స్ ను తన ప్రతి సినిమాల్లో కూడా ఏదో ఒక విధంగా ఇన్వాల్వ్ చేస్తున్న ప్రభాస్ ఇప్పుడు మాత్రం స్నేహితులను కాస్త పక్కన పెడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆదిపురుష్ సినిమా ఏపీ నైజాం రెండు హక్కులను కూడా ఇంతకుముందు UV క్రియేషన్స్ దక్కించుకున్నట్లుగా ఒక టాక్ వచ్చింది. దాదాపు 100 కోట్లకు డీల్ సెట్ అయినట్లు కథనాలు వెలువడ్డాయి.

అయితే ఇప్పుడు వారిని తప్పించి ప్రభాస్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారికి తెలుగు రాష్ట్రాల హక్కులను ఇచ్చాడని తెలుస్తోంది. దాదాపు 170 కోట్ల రేంజ్ లోనే ఆ హక్కులు అమ్ముడైనట్లుగా టాక్.

ఇక ప్రస్తుతం ప్రభాస్ వారి ప్రొడక్షన్ లోనే మారుతి సినిమా చేస్తున్నాడు. అయితే స్పిరిట్ సినిమా విషయంలో కూడా ప్రభాస్ యూవీ ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ సినిమాను ఈ ఏడాది చివర్లో మొదలు పెట్టనున్నాడు. అయితే ఈ సినిమాను టీ సిరీస్ తో పాటు యూవీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మించాలని అనుకుంది. అయితే ఇప్పుడు ప్రభాస్ UV క్రియేషన్స్ ను ఇక్కడ కూడా తప్పించేసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కి మరో అవకాశం ఇస్తున్నాడు.

వారి కాంబినేషన్ బాగా సెట్ అయినట్లు అనిపించడంతో ప్రభాస్ ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం అయితే యూవి క్రియేషన్స్ ప్రభాస్ కాంబినేషన్లో సినిమా లేదని అనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ప్రభాస్ స్నేహితుల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఇక ప్రభాస్ లైన్ లో వైజయంతి ప్రొడక్షన్ లో ప్రాజెక్ట్ K పాన్ వరల్డ్ మూవీగా రానుంది.