లారెన్స్ 'రుద్రన్' ఏమైపోయాడు?

Fri May 07 2021 15:00:01 GMT+0530 (IST)

Why No Updates On Lawrence Rudran

ఆదుకునేందుకు ఓటీటీ ఉందని నమ్మి వెళితే నమ్మినవారిని నట్టేట ముంచి ఆనక చేతులెత్తేస్తే.. ఆ సన్నివేశం ఎలా ఉంటుందో ఇప్పుడు నిర్మాతలకు అర్థమవుతోంది. మినిమం గ్యారెంటీ ఉంటుందని నమ్మి ఓటీటీలను ప్రాధేయపడితే ఇప్పుడు పూర్తిగా రివర్సులో ఉంది వీళ్ల వ్యవహారం.ఏదైనా వెంటపడితే అంతేగా!.. క్రేజీగా కొనేవాడే అమ్మేవాడి వెంటపడినప్పుడే ఏ ఉత్పత్తికి అయినా డిమాండ్. కానీ ఇటీవల క్రైసిస్ లో తిరిగి సినిమాలన్నీ ఓటీటీ బాట పడుతున్నాయి. నిర్మాతలే ఓటీటీల వెంట పడుతుంటే సీన్ రివర్సవుతోంది. థియేట్రికల్ రిలీజ్ ఇప్పట్లో సాధ్యం కాదని నమ్మిన నిర్మాతలు దిక్కు తోచని స్థితిలో కనీసం పెట్టిన పెట్టుబడులు అయినా  తిరిగి వస్తాయని భావించారు. కానీ ఓటీటీలు పెద్ద హ్యాండ్ ఇస్తున్నాయని వాళ్లు చెప్పే ధరలు ఏమాత్రం గిట్టుబాటు కాని పరిస్థితి ఉందని చెబుతున్నారు.

మరోవైపు థియేట్రికల్ రిలీజ్ కోసం వేచి చూడకపోతే ఈ రంగం ఇప్పట్లో కోలుకునేట్టు లేదు. కనీసం రెండు మూడు నెలలు ఆగి ఆ తర్వాత థియేటర్లకు కావాల్సిన కంటెంట్ ఇచ్చినా ఈ రంగం మనుగడ సాధ్యమవుతుంది. కానీ ఆ సన్నివేశం ఇప్పట్లో కనిపించడం లేదు. సెకండ్ వేవ్ క్రైసిస్ ఇప్పట్లో తొలగిపోతుందా? అంటే దానిపై క్లారిటీ లేకపోవడమే ఇందుకు కారణం. బంతి తమ కోర్ట్ లో ఉన్నప్పుడే ఆడాలి! అన్న చందంగా ఓటీటీలు వ్యవహరిస్తున్నాయి. కనీసం పెట్టిన పెట్టుబడిని అయినా వెనక్కి తెచ్చుకోలేని సన్నివేశంలో నిర్మాతలు లబోదిబోమంటున్నారు. ఓటీటీలు ఆదుకుంటాయని భావిస్తే ఇదీ సంగతి.