సమంత పైనే ఎందుకీ నెగిటివిటీ..??

Sun Jun 26 2022 08:00:01 GMT+0530 (IST)

Why Negativity on Samantha

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తరచుగా వార్తల్లో నిలిచే సెలబ్రిటీలలో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఒకరు. అయితే వాటిల్లో పాజిటివ్ ఎంత ఉందో.. నెగిటివిటీ కూడా అంతే ఉంది. ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య తో విడిపోయిన తర్వాత సామ్ చాలా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది.డివోర్స్ వ్యవహారంలో చై సామ్ లలో తప్పెవరిది అనేది నిజంగా బయటి వ్యక్తులకు తెలియదు. కానీ ఇందులో ఆమెదే మిస్టేక్ అనే విధంగా ఆ మధ్య నెట్టింట ప్రచారం జరిగింది. అప్పుడప్పుడు అలాంటి వాటికి సమంత స్ట్రాంగ్ గా జవాబు చెబుతూ వస్తోంది. అయినప్పటికీ అగ్ర కథనాయికపై ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు.

ఇటీవల నాగచైతన్య మరో హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడనే పుకార్లు పుట్టుకొచ్చాయి. దీని వెనుక మాజీ భార్య సామ్ ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు లేటెస్టుగా ‘నాస్టీ’ ట్రోల్స్ ను ఎదుర్కొంటోంది.

సద్గురు తో సమంత టాక్స్ కు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. అందులో సామ్ ను ఉద్దేశిస్తూ “మీరు కొన్నిసార్లు అందంగా ఉంటారు.. మీరు కొన్నిసార్లు అసహ్యంగా ఉంటారు” అని సద్గురు అన్నారు. దీన్ని ఆమె యాంటీ ఫ్యాన్స్ నెట్టింట షేర్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు.
 
నిజానికి ఒక వ్యక్తి యొక్క వివిధ దశల గురించి మాట్లాడుతూ సాధారణ అర్థంలో సద్గురు ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్భంలోనే బ్యూటీఫుల్ మరియు నాస్టీ అనే కామెంట్స్ చేసారు. అయితే ఓ వర్గం నెటిజన్లు మాత్రం సమంతను అసహ్యకరమైన వ్యక్తిగా చూపించాలనే ఉద్దేశ్యంతో కట్ చేసిన ఆ వీడియో క్లిప్పింగ్ ను వైరల్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అసలు ఈమధ్య సామ్ పైనే ఎందుకు ఇంత నెగిటివిటీ వస్తోందనే చర్చ మొదలైంది. విడాకులు అనేవి ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత నిర్ణయం. ఇక్కడ చైతన్య - సామ్ కూడా వారికున్న కారణాలతో పరస్పర అంగీకారంతో విడిపోవాలని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత ఇరువురు వేర్వేరు మార్గాల్లో పయనిస్తున్నారు.

సమంత డివోర్స్ ప్రకటన తర్వాత కెరీర్ మీద ఫోకస్ పెట్టింది. వరుసగా సినిమాలు కమిట్ అవుతూ బిజీగా మారిపోయింది. అదే సమయంలో సోషల్ మీడియాలో పరోక్షంగా ఎవరినో ఉద్దేశిస్తూ కొటేషన్స్ పెడుతూ వచ్చింది. మధ్య మధ్యలో తనని విమర్శించే వారికి కౌంటర్లు ఇస్తూ వచ్చింది. అయినప్పటికీ ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు.

సమంత రీసెంట్ టైమ్స్ లో గ్లామర్ డోస్ పెంచిందనే సంగతి తెలిసిందే. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తోంది. దీనిపైనా ఆమె ట్రోలింగ్ ని ఫేస్ చేస్తోంది. ఏ పోస్ట్ చేసినా ఓ బ్యాచ్ నెగిటివ్ కామెంట్స్ చేయడానికి తయారైపోతున్నారు. మరి వీటికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.

ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. 'యశోద' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ రిలీజ్ కు రెడీ అవుతోంది. 'శాకుంతలం' మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అలానే విజయ్ దేవరకొండ తో కలిసి 'ఖుషీ' అనే రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తోంది. వీటితో పాటుగా పలు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ సామ్ చేతిలో ఉన్నాయి.