నాని ఒక్కడే.. ఎందుకిలా..?

Fri Mar 17 2023 16:00:02 GMT+0530 (India Standard Time)

Why Nani Only for Promotions

నేచురల్ స్టార్ నాని దసరా సినిమా మరో 13 రోజుల థియేటర్ లో రచ్చ చేసేందుకు రెడీ వస్తుంది. కొత్త దర్శకుడితో రిస్క్ అని తెలిసినా సరే కథ మీద ఉన్న నమ్మకంతో నాని ఈ సినిమా చేశాడు. నాని అసలు స్టామినా ఏంటన్నది ఈ సినిమా ప్రూవ్ చేయబోతుంది. దర్శకుడు కొత్త వాడే.. నిర్మాతకు సక్సెస్ రేటు లేదు. ఒక్క హీరోయిన్ కీర్తి సురేష్ మాత్రమే అందరికీ తెలుసు. అయినా సరే రిలీజ్ ప్రమోషన్స్ లో నాని ఒక్కడే బ్యాటింగ్ చేస్తున్నాడు. స్టార్ సినిమా అయినా సరే భారీ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తేనే సినిమాలు ఆడియన్స్ కు రీచ్ అవుతున్నాయి.అయితే వారు కూడా సినిమా యూనిట్ అందరినీ ప్రమోషన్స్ లో భాగం చేస్తున్నారు. కానీ నాని మాత్రం కేవలం వన్ మ్యాన్ ఆర్మీ అన్నట్టుగా చేస్తున్నాడు. దసరా సినిమా కోసం నాని బీభత్సమైన ప్రమోషన్స్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే సినిమా నుంచి నాని ఒక్కడు మాత్రమే ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. నాని ఒక్కడే ఎందుకు మిగతా వారు ఎందుకు కనిపించట్లేదు అంటే నాని ఈ సినిమాను తన భుజాల మీద వేసుకున్నాడు. తను ఒక్కడే ప్రమోట్ చేస్తూ సినిమా ఫలితాన్ని కూడా తను ఎంజాయ్ చేయనున్నాడు.

డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఎవరికి తెలియదు కాబట్టి ఆయన ప్రమోషన్స్ లో పాల్గొనక పోవచ్చు కానీ కీర్తి సురేష్ అందరికి తెలిసిన హీరోయినే.. నేషనల్ అవార్డ్ విన్నర్ కాబట్టి నార్త్ ఆడియన్స్ కు ఆమె పరిచయమే. మరి అలాంటిది కీర్తి సురేష్ కూడా దసరా ప్రమోషన్స్ లో పాల్గొనక పోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. సినిమా ప్రమోషన్ అంటే రాజమౌళి ని ఫాలో అవ్వాల్సిందే. సినిమాను ఆయన చేసినట్టుగా ఎవరు ప్రమోట్ చేయరు. అందుకే ఆయన చేసిన బాహుబలి ఆర్.ఆర్.ఆర్ నేషనల్ ఆడియన్స్ కి రీచ్ అయ్యింది.

ఇక ఇదే పంథా కొనసాగించిన పుష్ప కూడా పాన్ ఇండియా సక్సెస్ అందుకుంది. పుష్ప ప్రమోషన్స్ లో హీరోయిన్ రష్మిక మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ని కూడా ఇన్వాల్వ్ చేయించాడు డైరెక్టర్ సుకుమార్. అలాంటిది నాని దసరా విషయంలో మాత్రం నాని ఒక్కడే కనిపిస్తున్నాడు. మరి రిలీజ్ ఎలాగు మరో 10 రోజులు ఉంది కదా మరో ఈవెంట్ ఏదైనా ముంబైలో ప్లాన్ చేసి అక్కడికి చిత్ర యూనిట్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడేమో చూడాలి. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసిన దసరా పమోషన్స్ లో హీరో ఒక్కడే పాల్గొనడం మాత్రం ఆడియన్స్ ని నిరాశపరుస్తుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.