Begin typing your search above and press return to search.

దగ్గుబాటి సినిమాకు అక్కినేని దూరం ఎందుకో

By:  Tupaki Desk   |   12 Dec 2019 5:30 PM GMT
దగ్గుబాటి సినిమాకు అక్కినేని దూరం ఎందుకో
X
ఒక ఫ్యామిలీ నుండి ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేస్తున్నారంటే అటు ఫ్యాన్స్ లో మంచి ఉత్సాహం నెలకొంటుంది. ఇక రెండు ఫ్యామిలీల నుండి ఇద్దరూ హీరోల సినిమా అందులోనూ రియల్ మామ అల్లుడు రీల్ మీద కూడా అవే పాత్రలు చేస్తే హంగామా మాములుగా ఉండదు. అవును వెంకటేష్ -చైతూ నటించిన 'వెంకీ మామ' ఫ్యాన్స్ ని ఖుషి చేస్తూ రేపే థియేటర్స్ లోకి వచ్చేస్తోంది.

ప్రస్తుతానికి అటు అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ఇటు దగ్గుబాటి ఫ్యాన్స్ కూడా జోష్ లో ఉన్నారు కాకపోతే.. ఈ సినిమాకు అక్కినేని ఫ్యామిలీ మాత్రం కాస్త దూరంగానే ఉంది. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున , అఖిల్, సుమంత్ ఇలా ఎవరూ కనిపించలేదు.

అందరి పక్కనపెడితే నాగ్ అసలు ఈ సినిమా గురించి ఇంత వరకూ ఎక్కడ మాట్లాదిందే లేదు. ఎందుకో నాగ్ ఈ సినిమాపై సైలెన్స్ మైంటైన్ చేస్తున్నాడు. ఒక వేళ వెంకీ మామ ను కేవలం దగ్గుబాటి సినిమాగానే ఫీలవుతున్నారా లేదా సురేష్ బాబు , రానా ఉన్నారు కదా అని లైట్ తీసుకున్నాడా ..? ఏదేమైనా వెంకీ మామ సినిమా ఈవెంట్ లో నాగ్ కూడా కనిపించి రెండు ముక్కలు పంచుకుంటే బాగుండేదని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు.