విడాకుల పుకార్లపై మెగా ఫ్యామిలీ మౌనం ఎందుకో..?

Tue Jan 25 2022 11:17:00 GMT+0530 (India Standard Time)

Why Mega Family Silence on Divorce Rumors

సినీ ఇండస్ట్రీలో విడాకుల పర్వం గురించి గత కొంతకాలంగా ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలా మంది సెలబ్రిటీ కపుల్స్ పరస్పర అంగీకారంతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఆమె భర్త కళ్యాణ్ దేవ్ తో విడాకులు తీసుకోబోతున్నారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.శ్రీజ తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నేమ్ 'శ్రీజ కళ్యాణ్' ను 'శ్రీజ కొణిదెల' గా మార్చడం.. అలానే తన భర్తను అన్ ఫాలో చేయడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారం గురించి రోజూ ఏదొక వార్త వస్తూనే ఉంది. శ్రీజ - కళ్యాణ్ దేవ్ జంట విడాకులపై పుకార్లు షికార్లు చేస్తున్నప్పటికీ.. ఇంతవరకు ఇరు వర్గాలు దీనిపై స్పందించలేదు.

ఇటీవల మెగా ఫ్యామిలీలో మీటింగ్స్ లో హీరో కళ్యాణ్ దేవ్ కనిపించలేదు. దీనికి తోడు గత కొన్ని రోజులుగా మెగా అల్లుడు మీడియాకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల విడుదలైన తన సినిమా 'సూపర్ మచ్చి' ప్రమోషన్స్ లో కూడా పాల్గొనలేదు. మరోవైపు మెగా కాంపౌండ్ సభ్యులు కూడా దీనిపై వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారు.

ఇప్పటివరకు ఏ ఒక్క మెగా హీరో కూడా పరోక్షంగా అయినా ఈ విషయంపై స్పందించలేదు.. పుకార్లను ఖండించలేదు. అలానే కళ్యాణ్ దేవ్ నటించిన 'సూపర్ మచ్చి' సినిమాను ప్రమోట్ చేయలేదు. సంక్రాంతి సందర్భంగా మెగా హీరోలు పోస్ట్ చేసిన వీడియోలను చూస్తే ఈ సమస్య వారి కుటుంబాన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేదనిపిస్తోంది.

అయినప్పటికీ ఈ వ్యూహాత్మక మౌనం ఎందుకనేది మెగా అభిమానులను ఆలోచించింపజేస్తోంది. నిజంగానే శ్రీజ - కళ్యాణ్ జంట మధ్య మనస్పర్థలు వచ్చాయా? వారు విడిపోతునట్లు జరుగుతున్న ప్రచారం నిజమేనా? లేదా వారిద్దరిని కలపడానికి ప్రయత్నాలు జరుగుతుండటం వల్ల దీనిపై సైలెంట్ గా ఉంటున్నారా?.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఫ్యాన్స్ మదిలో ఉన్నాయి.

2016లో కళ్యాణ్ దేవ్ తో శ్రీజ వివాహం వైభవంగా జరిగింది. వీరికి నవిష్క అనే పాప కూడా ఉంది. గత కొంతకాలంగా జరుగుతున్న పరిస్థితులు వీరిద్దరూ విడిపోతున్నారనే ఊహాగానాలకు ఊతం ఇచ్చేలా ఉన్నాయి. మరి త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వస్తుందేమో చూడాలి.