సాయిపల్లవి ఎందుకు మౌనం పాటిస్తోంది?

Sat Dec 10 2022 05:00:02 GMT+0530 (India Standard Time)

Why Is Sai Pallavi Hiding

టాలీవుడ్ లో వున్న హైలీ టాలెంటెడ్ హీరోయిన్ లలో ముందు వరుసలో నిలిచే హీరోయిన్ సాయి పల్లవి. `ఫిదా` మూవీతో తొలి ఎంట్రీతోనే తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన సాయి పల్లవి తనదైన మార్కు పాత్రలతో సినిమాలతో ప్రత్యేకతని చాటుకుంటూ తెలుగు తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. కానీ ఈ మధ్య మాత్రం తన క్రేజ్ కి తగ్గ సక్సెస్ లని సొంతం చేసుకోలేకపోతోంది. 2021లో బ్యాక్ టు బ్యాక్ రెండు సక్సెస్ లని సొంతం చేసుకుంది.నాగచైతన్యతో `లవ్ స్టోరీ` నేచురల్ స్టార్ నానితో `శ్యామ్ సింగరాయ్` సినిమాలతో వరుసగా విజయాల్నిదక్కించుకుంది. అయితే 2022 మాత్రం సాయి పల్లవి కలిసి రాలేదని చెప్పాలి. భారీ అంచనాలు పెట్టుకుని రానాతో కలిసి చేసిన `విరాటపర్వం` రిలీజ్ ఆలస్యం అవుతూ వచ్చి చివరికి నిరాశ పరిచింది. ఇక తమిళంలో నటించిన `గార్గి` మూవీ తమిళ తెలుగు భాషల్లోనూ ప్రశంసల్ని అందించిందే కానీ విజయాన్ని అందించలేకపోయింది.

జూన్ 17న `విరాటపర్వం` జూలై 15న `గార్గి` విడుదలైంది. ఈ రెండు సినిమాలు విడుదలై నెలలు గడుస్తున్నా సాయి పల్లవి ఇంత వరకు మరో సినిమాని అంగీకరించలేదు. ఇక ఈ సినిమాల సమయంలో `ది కశ్మీర్ ఫైల్స్` సినిమాపై సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెర తీశాయి. తనపై బీజేపీ పార్టీ శ్రేణులు విశ్వహిందూ పరిశత్ వర్గాలు కేసుని నమోదు చేయించడం అప్పట్లో సంచలనం సృష్టించింది కూడా.

ఇక సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందని ఇకపై సినిమాలు చేయదని త్వరలో ఓ హాస్పిటల్ ని ప్రారంభించబోతోందని ఆ ఏర్పాట్లలో ప్రస్తుతం బిజీగా వుందని ఆ కారణంగానే కొత్త ప్రాజెక్ట్ లు అంగీకరించడం లేదనే వార్తలు జోరుగా వినిపించడం మొదలైంది. ఇక ఇటీవల మరో వార్త కూడా వైరల్ కావడం తెలిసిందే. తను బాలీవుడ్ లో పరిచయం కాబోతోందని ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా వార్తలు వినిపించడం మొదలైంది.

ఈ వార్తలపై సాయి పల్లవి కానీ తన టీమ్ కానీ ఈ వార్తలపై స్పందించక పోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సమంత విషయంలో వస్తున్న వార్తలపై తన టీమ్ స్పందిస్తూ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. కానీ సాయి పల్లవి ఆమె టీమ్ మాత్రం ఎందుకు మౌనం పాటిస్తున్నారో అర్థం కాడం లేదని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.