అలీ సర్ లో ఎందుకంత ఫ్రస్టేషన్?

Tue Oct 22 2019 09:53:52 GMT+0530 (IST)

కాకి పిల్ల కాకికి ముద్దు. ఎవరు చేసిన సినిమా వాళ్లకు ముద్దు. దానిపై ఎదుటివాళ్లు విమర్శలు ఎక్కుపెట్టినప్పుడు కలిగే బాధను అర్థం చేసుకుని తీరాలి. కోట్లలో సొమ్ములు వెదజల్లి ఎంతో ప్రేమగా తీసిన సినిమాపై క్రిటిక్స్ విమర్శలు గుప్పిస్తుంటే తట్టుకోవడం కూడా అంత సులువేమీ కాదు. ఎందుకంటే క్రిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వ్యక్తిగతం.. పైగా ప్రేక్షకుడి కోణంలో రివ్యూలు రాస్తుంటారు. అలానే రాజుగారి గది 3 చిత్రానికి రివ్యూల్ని ఇచ్చారు క్రిటిక్స్. ఎవరో ఒకరిద్దరు కాదు అన్ని రివ్యూల్లో ఇంచుమించు ఒకే రకంగా రేటింగులు ఇచ్చారు. నాశిరకం హారర్ కామెడీ అంటూ తిట్టిపోశారు. రొటీన్ గా తీస్తే రొటీన్ అనే అన్నారు. అయితే ఈ చీవాట్లు ఏవీ గిట్టలేదు కమెడియన్ అలీకి. ఈ చిత్రంలో పూర్తి స్థాయి పాత్రలో నటించిన అలీ దానిని తట్టుకోలేకపోయారు. చాలా కాలం తర్వాత తాను ఎంతో ఎక్స్ పెక్ట్ చేస్తే సమీక్షకుల నుంచి ఇలాంటి రివ్యూల్ని ఆయన ఊహించలేనట్టుంది.కారణం ఏదైనా.. ఆయన సమీక్షకులపై తీవ్రస్థాయి విమర్శలు చేశారు. కోన్ కిస్కా గొట్టాంగాళ్లు అంటూ తనదైన శైలిలో బూతులే తిట్టేశారు. రివ్యూ రైటర్లు బోకులు అన్న అర్థంలో పరోక్షంగా సెటైర్లు వేశారు. నేరుగా క్రిటిక్స్ మాట ఎత్తకుండానే కొందరు అంటూ తిట్టేశారు. ``కొందరు మాత్రం మా సినిమాలో లోపాల్ని వెతకడమే పనిగా పెట్టుకున్నారు. సినిమా బాగోలేదని రకరకాల కామెంట్లు చేశారు. మా సినిమాని అనడానికి ఈ కోన్ కిస్కా గొట్టం గాళ్లు ఎవరు?`` అంటూ అలీ ప్రశ్నించారు. వాళ్లంతా బోకులు అని ఆయన విమర్శించారు. ప్రివ్యూ షోల్లో ఎవరూ సరిగా నవ్వరు. ఫీలింగ్స్ దాచేసుకుంటారు అంటూ క్రిటిక్స్ పై సెటైర్ వేశారు. అయినా ప్రేక్షకుల కోసం సినిమాలు తీస్తాం. వీళ్ల కోసం కాదు.. అని అన్నారు.

అయితే అలీలోని ఫ్రస్టేషన్ ని క్రిటిక్స్ కూడా అర్థం చేసుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఆయనకో ఛాన్స్ వచ్చింది. దాంతో ఆయన చాలా ఎగ్జయిట్ మెంట్ లో ఉన్నారు. అయితే ఫలితం ఇంత దారుణంగా వస్తుందని ఆయన ఊహించలేదు. నాశిరకం కామెడీలు.. చెత్త కామెడీల సీజన్ అయిపోయిందని క్రిటిక్స్ విమర్శించడం బహుశా అలీకి నచ్చలేదు. దాంతో ఆయనలోని ఫ్రస్టేషన్ - కోపం కలగలిసి అలా బయటకు వచ్చాయని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ భ్రమరాంభలో మాస్ ఆడియెన్ కి సినిమా బాగా నచ్చిందని అన్నారు. అయితే ఇదే తీరుగా అన్నిచోట్లా నచ్చి కలెక్షన్స్ బాగా దక్కితే మంచిదే. అసలైన ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతవరకూ నచ్చింది అన్నది ఈ వీకెండ్ నాటికే తేలిపోనుంది. అయినా సరిగా అవకాశాల్లేక ఇలా అయ్యారా అలీ గారు...?  ముందు నాశిరకం కామెడీలు వదిలి హుందా అయిన కామెడీలు చేయడమెలా అన్నది ముఖ్యం. ఇప్పుడు ఆడియెన్ మారారు. అందుకు తగ్గట్టే అప్ డేటెడ్ గా ఉంటే మంచిదేమో!