అల్లు అరవింద్ కి చిరంజీవి మళ్లీ షాకిచ్చారా?

Mon Aug 10 2020 10:15:36 GMT+0530 (IST)

Why Chiranjeevi Not Giving A Chance To Other Producers

అన్నీ అనుకున్నట్టే జరిగితే మెగాస్టార్ రీలాంచ్ మూవీని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ చేయాల్సింది. కానీ ఛాన్స్ మిస్. మధ్యలో చరణ్ రంగ ప్రవేశం చేశారు. మదర్ సెంటిమెంట్ తో సొంతంగా కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్ ని ప్రారంభించి డాడీ చిరంజీవిని రీలాంచ్ చేశారు రామ్ చరణ్. నాన్నగారితో సినిమా చేయాలనేది అమ్మ కోరిక. అందుకే ఈ బ్యానర్ ని ప్రారంభించి `ఖైదీనంబర్ 150` చేస్తున్నానని రామ్ చరణ్ అప్పట్లో అన్నారు.ఖైదీనంబర్ 150 తర్వాత మెగాస్టార్ చిరంజీవితో తమ బ్యానర్ లోనే సినిమా ఉంటుందని బాస్ అల్లు అరవింద్ అదే మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొని మరీ చెప్పారు. బోయపాటి స్క్రిప్టు రెడీ అయ్యింది. ఇక సెట్స్ కెళ్లడమే అన్నంత కాన్ఫిడెన్స్ చూపించారు. ఆ తర్వాత కూడా బోయపాటితో సినిమా చేసేందుకు చిరు సుముఖత వ్యక్తం చేశారని ప్రచారమైంది. కానీ ఏమైందో మళ్లీ ఆ ఊసే లేదు.

ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా 151వ సినిమా `సైరా-నరసింహారెడ్డి`ని రామ్ చరణ్ నిర్మించారు. ఈసారి కూడా పాన్ ఇండియా లెవల్లో నాన్నగారికి కానుక ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నామని రామ్ చరణ్ అన్నారు. కనీసం 151వ సినిమా ఆఫర్ అయినా గీతాధినేతకు దక్కుతుందని భావిస్తే ఆ ఛాన్స్ అలా మిస్సయ్యింది. కనీసం.. 152 వ చిత్రం.. 153వ చిత్రానికి కూడా అల్లు అరవింద్ కి అవకాశం లేకపోవడమే ఆశ్చర్యపరుస్తోంది. బావమరిది అరవింద్ కి కాదని చిరు వేరే ఎవరికో కాల్షీట్లు ఇస్తున్నారు మరి.

కొరటాలతో ఆచార్య (చిరు 152) చిత్రాన్ని నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఆ తర్వాత కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్లకు చిరు కాల్షీట్లు ఇచ్చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అల్లు అరవింద్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. కానీ బాస్ వరుస మాత్రం వేరేగా ఉంది!! అంటూ గుసగుసలు వేడెక్కిస్తున్నాయ్. ఇతర బ్యానర్లకు అవకాశాలిస్తూ కొణిదెల ప్రొడక్షన్స్ అధినేత రామ్ చరణ్ మామ అరవింద్ ని విస్మరిస్తున్నారా?  లేక అరవింద్ ఆశించినట్టు ఆ టైమ్ కలిసి రావడం లేదా? అన్నదానికి ఆయనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మైత్రికి సోలోగానే ఛాన్సిచ్చారు. ఇక చిరంజీవి కెరీర్ ఆద్యంతం గీతా ఆర్ట్స్ బ్యానర్ అండగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ బ్యానర్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమాలు చేస్తోంది. జీఏ 2 బ్యానర్ ప్రారంభించి చిన్న హీరోలతోనూ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.