చిరు - మహేష్ లకు విషెస్ చెప్పిన చంద్రబాబు..ఎన్టీఆర్ ని ఎందుకు విష్ చేయలేదు..?

Tue Aug 11 2020 13:00:20 GMT+0530 (IST)

Why Chandra Babu Not Wishing Jr Ntr On His Birthday?

నందమూరి తారక రామారావు వారసులుగా సినీ రాజకీయాల్లోకి ఆయన్ని అనుసరిస్తూ ఇప్పటికి చాలామంది ఎంట్రీ ఇచ్చారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ కోసం 2009 ఎన్నికల ప్రచారంలో క్రియాశీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఎలక్షన్స్ తర్వాత నుండి ఎందుకో ఎన్టీఆర్ ని టీడీపీ అధిష్టానం దూరం పెడుతూ వచ్చింది. టీడీపీ ఎన్నికల ప్రచారంలో కనిపించిన ఎన్టీఆర్.. ఈ పదేళ్లలో పార్టీకి సంబంధించి నిర్వహించిన ఒక్క సమావేశంలో కూడా కనిపించలేదు. దీంతో ఎన్టీఆర్ వైస్సార్సీపీతో టచ్ లో ఉంటున్నాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే తారక్ మాత్రం తన తాత స్థాపించిన పార్టీలోనే ఉంటానని చెప్పి ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్ పార్టీలో ఉంటానని చెప్పినప్పటికీ టీడీపీ అధిష్టానం మాత్రం ఎన్టీఆర్ ని ఇప్పటికి దూరం పెడుతోంది అని నందమూరి అభిమానులు అభిప్రాయపడుతున్నారు.నందమూరి వంశానికి సినీ రాజకీయ వారసుడు అయిన ఎన్టీఆర్ కి తగిన గౌరవం ఇవ్వడం లేదని కామెంట్స్ చేస్తున్నారు. నారా చంద్రబాబు తన కొడుకు లోకేష్ ఎదుగుదల కోసం ఎన్టీఆర్ ని పక్కన పెట్టారని.. బాలకృష్ణ సైతం తన అల్లుడు రాజకీయ భవిష్యత్ గురించే ఆలోచిస్తున్నాడని నందమూరి ఫ్యాన్స్ బహిరంగంగానే కామెంట్స్ చేశారు. చంద్రబాబు మొదటి నుండి కూడా తారక్ ని నందమూరి వారసుడిగా గుర్తించడం లేదని టాక్ వినిపించింది. దీనికి తగ్గట్టే చంద్రబాబు వ్యవహార శైలి కూడా నడిచింది. చిరంజీవి - మహేష్ బాబు -  ప్రభాస్ లాంటి హీరోల పుట్టినరోజు నాడు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసే చంద్రబాబు.. ఎన్టీఆర్ బర్త్ డేని మాత్రం విస్మరిస్తూ వచ్చాడు.

కాగా మే 20న తారక్ పుట్టినరోజు నాడు నందమూరి అభిమానులు టీడీపీ నాయకులు అతనికి విషెస్ చెప్పినప్పటికీ చంద్రబాబు మాత్రం చెప్పలేదు. అయితే రీసెంటుగా మహేష్ బాబు బర్త్ డే నాడు చంద్రబాబు - లోకేష్ లు ట్వీట్స్ చేసి మరీ విషెస్ చెప్పారు. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. నందమూరి సినీ రాజకీయ వారసుడు ఎన్టీఆర్ ని కావాలనే ఇన్సల్ట్ చేస్తున్నారని కామెంట్స్ చేసారు. మొదటి నుండి కూడా తారక్ పట్ల సీబీఎన్ వైఖరిని తప్పుపడుతూ వస్తున్న నందమూరి అభిమానులు.. ఇతర హీరోలకు ఇచ్చిన వాల్యూ జూనియర్ ఎన్టీఆర్ కి ఇవ్వడం లేదని.. కావాలనే నందమూరి వారసుడిని పక్కన పెడుతున్నారని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.