Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ అర డజను సినిమాలు అనౌన్స్ చేసినా హడావిడి లేదే..!

By:  Tupaki Desk   |   27 Oct 2020 5:30 PM GMT
పవర్ స్టార్ అర డజను సినిమాలు అనౌన్స్ చేసినా హడావిడి లేదే..!
X
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన 'పవర్ స్టార్' ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన స్టైల్ తో సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న పవన్.. ఇప్పటి వరకు 25 సినిమాలలో నటించాడు. పవన్ నటించిన సినిమాలు రిజల్ట్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రాబడుతుంటాయంటేనే పవర్ స్టార్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే సిల్వర్ జూబ్లీ మూవీ 'అజ్ఞాతవాసి' డిజాస్టర్ గా మిగిలిపోవడం.. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమయ్యాడు. ఎన్నికలలో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడం.. అందులోనూ వచ్చే ఎన్నికలకు చాలా సమయం ఉండటంతో మళ్ళీ సినిమాల్లో నటించడానికి పవర్ స్టార్ నిర్ణయించుకున్నాడు.

ప‌వ‌న్ సినిమాల్లో నటించాలని అలా అనుకున్నాడో లేదో వరుసపెట్టి ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఒక్క సినిమాలో నటిస్తే చాలు అనుకున్న అభిమానులకు అర డజను సినిమాలను అందించడానికి రెడీ అయ్యాడు. ముందుగా దిల్ రాజు ప్రొడక్షన్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' సినిమాని ఓకే చేశాడు. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా మరో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏఎమ్ రత్నం నిర్మించనున్న ఓ పీరియాడికల్ మూవీకి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలానే 'గబ్బర్ సింగ్' వంటి సూపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమాని ఎప్పుడు సెట్స్‌ పైకి తీసుకెళ్తాడో అని ఆలోచించే లోపే మరో మూడు సినిమాలను ఒప్పుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మాణంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్ బండ్ల గణేష్ ప్రొడక్షన్ లో కూడా ఓ ప్రాజెక్ట్ చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇలా ఎప్పుడూ లేనంత స్పీడ్ గా ఐదు సినిమాలను లైన్లో పెట్టిన పవర్ స్టార్.. లేటెస్టుగా 'అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌' తెలుగు రీమేక్ కి అంగీకరించాడు. 'అప్ప‌ట్లో ఒకడుండేవాడు' ఫేమ్ సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య దేవ‌ర నాగ‌వంశీ - ప‌వ‌న్ క‌ళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ ముగ్గురూ కలిసి నిర్మిస్తారని సమాచారం. వీటితో పాటు మ‌రో రెండు సినిమాలు చేస్తానంటూ హామీ ఇచ్చి స‌ద‌రు డైరెక్ట‌ర్స్ తో స్క్రిప్ట్ వ‌ర్క్స్ చేయిస్తున్నాడట. అయితే పవర్ స్టార్ అర డజను సినిమాలు అనౌన్స్ చేసినా వీటి సౌండింగ్ మాత్రం అస్స‌లు లేదనే కామెంట్స్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా ప్రకటన వచ్చినదగ్గర నుంచీ మూవీ రిలీజై స‌క్సెస్ మీట్ పెట్టే వ‌ర‌కు ఓ స్థాయిలో హడావుడి జ‌రిగేది. ఒకప్పుడు ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ వచ్చిన పవన్ ఆ మధ్య సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం అలవాటు చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఆరు కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించినా వాటి సందడి మాత్రం లేదని అంటున్నారు. ఒకేసారి ఇన్ని సినిమాలు ప‌వ‌న్ ఎనౌన్స్ చేయ‌డం వల్లనే వాటి ఊసు లేకుండా పోతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అటు పాలిటిక్స్ ఇటు సినిమాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్న జనసేన అధినేత వచ్చే ఎన్నికల లోపు వీటిలో ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తాడనేది ప్రశ్నార్థకమే. కాగా, న‌వంబర్ 2 నుంచి పవన్ 'వ‌కీల్ సాబ్' సెట్స్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. ప్ర‌స్తుంత ఫుల్ గడ్డం, జుట్టుతో కనిపిస్తున్న పవన్ కళ్యాణ్.. ఈలోపు ప‌వ‌న్ లాయర్ సాబ్ లుక్ లో మారిపోతాడేమో చూడాలి.