కంగన ముద్దాడిన ఆ బుడతడు ఎవరూ?

Sun Nov 22 2020 21:00:17 GMT+0530 (IST)

Who was that kid who kissed Kangana?

నిరంతరం ఎవరో ఒకరిపై చిర్రుబుర్రులాడే కంగన ఇదిగో ఇలా అదిరే ముద్దిచ్చింది. అది కూడా ఓ చిన్నారి బాలకుడి పెదవి అంచుపై ముద్దాడి ఆశ్చర్యపరిచింది. అయితే అది అన్ని ముద్దుల్లాంటిది కాదు. అభిమానం ఆత్మీయతను కురిపించే ముద్దు. తన ప్రేమను మేనల్లుడిపై ది బెస్ట్ గా ఆవిష్కరించిన ముద్దు అది. కంగనా రనౌత్ ఆదివారం నాడు మేనల్లుడు పృథ్వీరాజ్ ని ఇలా ముద్దాడేస్తున్నప్పటి ఫోటోని అభిమానులకు షేర్ చేసింది.ప్రస్తుతం `తలైవి` హైదరాబాద్ షూట్ కోసం బయలుదేరిన రోజును ప్రతిసారీ గుర్తుచేసుకునేలా .. ఇలా స్పెషల్ గా తన మేనల్లుడిని ముద్దాడిందట. అతను ఆమెను వెళ్లవద్దని మారాం చేస్తే ఆమె ఇలా చక్కని ముద్దిచ్చి సర్ధి చెప్పి షూట్ కి వచ్చేసిందట.

“మేము షూట్ కోసం బయలుదేరినప్పుడు నన్ను వెళ్ళవద్దు అని అన్నాడు. నేను పనికి వెళ్లాలని పట్టుబట్టాను. అతను ఆలోచనాత్మకంగా చూసాడు. వెంటనే నా ఒడిలో కూర్చుని నవ్వుతూ అన్నాడు .... సరే మీరు వెళ్ళండి కానీ నన్ను మీతో కూర్చోనివ్వండి అన్నాడు. రెండు నిమిషాల పాటు .... అతని ముఖం చూస్తూ ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాను” అంటూ కంగన మేనల్లుడి పెదవులపై ముద్దాడేసిందిలా. ఈ నెల ఆరంభం ఉదయపూర్ లో జరిగిన ఆమె సోదరుడు అక్షత్ వివాహం నుండి వచ్చిన అనంతర పరిణామమిది.

ఇప్పుడు ఒక నెలకు పైగా కంగనా.. ఫ్యామిలీలో వివాహాల సందడితో బిజీగా ఉంది. కంగనా తమ్ముడు అలాగే బంధువు ఒకరు అక్టోబర్-నవంబర్ కాలంలో వివాహం చేసుకున్నారు. కంగన సోదరి రంగోలి ఈ వేడుక నుండి టన్నుల కొద్దీ ఫోటోలు.. వీడియోలను పంచుకున్నారు. ఆమె బంధువు స్వస్థలం హిమాచల్ ప్రదేశ్ లో వివాహం చేసుకున్నారు. ఆమె సొంత సోదరుడి వివాహం కోసం..ఉదయపూర్ కు వెళ్లింది.

కంగన ప్రస్తుతం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత బయోపిక్ తో బిజీగా ఉంది. మార్చి నుండి ఆగస్టు మధ్య కరోనావైరస్ లాక్ డౌన్ కాలంలో ఆమె తన స్వస్థలమైన మనాలిలో గడిపింది. లాక్ డౌన్ నిబంధనలను ప్రభుత్వాలు సడలించాక కంగనా చెన్నైలో ఒక షెడ్యూల్ చేసింది. ఇప్పుడు హైదరాబాద్ లో నివాసం ఉంది.

కంగనకు మరో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ధాకడ్ .. తేజస్ చిత్రాలతో కంగన బిజీ. తలైవి షూట్ కోసం ఆమె 70 కిలోల బరువు కు పెరిగింది.  అయితే ఇప్పుడు బరువు తగ్గుతోంది. తదుపరి చిత్రాల కోసం కఠినంగా శిక్షణ తీసుకుంటోంది.

ధాకడ్ కోసం కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ యాక్షన్ రిహార్సల్స్ నుండి చిత్రాలను పంచుకుంటూ.. “మల్టీ టాస్క్ చేయడం ఇష్టం లేదు.. కానీ ఈ కాలంలో నేను గుర్రంలా పనిచేయాలి`` అంటూ వ్యాఖ్యను జోడించింది.

తేజస్‌లో ఆమె ఫైటర్ పైలట్ గా కనిపిస్తుంది. కొన్ని నెలల క్రితం ఈ చిత్రం నుండి ఒక పోస్టర్ షేర్ చేయగా.. కంగనా ఎయిర్ ఫోర్స్ పనిలో అలసట చెందిన దానిగా కనిపించింది. యుద్ధ విమానంతో నిలబడిన ఫోటో క్యూరియాసిటీని పెంచింది.