ఐకానిక్ ప్రాజెక్ట్ లో హీరోగా ఎవరు నటిస్తారు...?

Sun Aug 02 2020 19:30:13 GMT+0530 (IST)

Who plays the hero in the iconic project ...?

దిల్ రాజు ప్రొడక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా 'ఐకాన్ - కనబడుటలేదు' అనే సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 'ఓ మైండ్ ఫ్రెండ్' 'ఎంసీఏ' సినిమాలను తెరకెక్కించిన వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని గతేడాది అల్లు అర్జున్ బర్త్ డే నాడు ప్రకటించారు. అయితే అప్పటి నుంచి 'ఐకాన్' నుంచి మరో అప్డేట్ ఎక్కడా కనిపించలేదు. ఈ క్రమంలో బన్నీ 'అల వైకుంఠపురంలో' సినిమా కంప్లీట్ చేయడంతో పాటు సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప'ని పట్టాలెక్కించేసాడు. దీంతో 'ఐకాన్' ఆగిపోయిందని అందరూ అనుకున్నారు. అయితే సరిగ్గా ఏడాది తర్వాత బన్నీ పుట్టినరోజు సందర్భంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ట్వీట్ చేస్తూ 'ఐకాన్' ప్రాజెక్ట్ త్వరలోనే ఉండబోతోందని హింట్ ఇచ్చింది. అయితే ఇటీవల అల్లు అర్జున్ 'ఐకాన్'ని పక్కనపెట్టి కొరటాల శివ దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు. ఈ నేపథ్యంలో 'ఐకాన్' ఇక కనిపించకపోవచ్చని అందరూ ఫిక్స్ అయ్యారు.కాగా 'ఐకాన్' ని బన్నీతో చేసే అవకాశాలు లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ని ఎలాగైనా మరో స్టార్ తో చేయాలని దిల్ రాజు భావిస్తున్నారట. సామాజిక రాజకీయ అంశాలతో కూడిన ఈ స్క్రిప్ట్ ఓ హాలీవుడ్ చిత్రానికి ప్రేరణగా ఉంటుందని తెలుస్తోంది. ఈ స్క్రిప్ట్ పై పూర్తి నమ్మకం పెట్టుకున్న దిల్ రాజు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో నటించే హీరో కోసం చూస్తున్నాడట. ప్రస్తుతం 'వకీల్ సాబ్' సినిమాతో బిజీగా ఉన్న వేణు శ్రీరామ్.. ఆ సినిమా కంప్లీట్ అయిన వెంటనే 'ఐకాన్' స్క్రిప్ట్ లో కొన్ని ఛేంజెస్ చేసి వేరే హీరోలకు చెప్పాలని డిసైడ్ అయ్యారట. దిల్ రాజ్ కూడా ఎన్టీఆర్ - రామ్ చరణ్ - నాని లలో ఎవరైనా ఈ స్టోరీకి సెట్ అవుతారని భావిస్తున్నారట. మరి ఈ ఐకానిక్ సబ్జెక్టు చేయడానికి ఏ హీరో ముందుకొస్తాడో చూడాలి.