Begin typing your search above and press return to search.

సూపర్‌ హిట్ సీక్వెల్‌ డైరెక్టర్‌ కన్ఫ్యూజన్‌

By:  Tupaki Desk   |   17 Jan 2022 9:30 AM GMT
సూపర్‌ హిట్ సీక్వెల్‌ డైరెక్టర్‌ కన్ఫ్యూజన్‌
X
బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్‌ పాన్ ఇండియా స్టార్‌ రైటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన రచన సారథ్యంలో పలు బాలీవుడ్ చిత్రాలు విడుదల అయ్యి ఘన విజయం ను దక్కించుకున్నాయి. బజరంగీ భాయిజాన్ సినిమా తో బాలీవుడ్ లో టాప్ స్టోరీ టెల్లర్‌ గా నిలిచిన విజయేంద్ర ప్రసాద్ ఇప్పుడు పలు సినిమాలకు కథలు అందిస్తున్నాడు. బాలీవుడ్‌ లో సినిమాల కథల విషయంలో విజయేంద్ర ప్రసాద్‌ తో చర్చలు జరిపేందుకు ఎంతో మంది స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్ ముందుకు వస్తున్నారు. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్‌ దృష్టి బాలీవుడ్‌ లో సూపర్‌ హిట్‌ అయిన బజరంగీ భాయిజాన్ సినిమాకు సంబంధించిన సీక్వెల్‌ పై ఉందని తెలుస్తోంది.

తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కథను సిద్దం చేసినట్లుగా కూడా చెప్పుకొచ్చాడు. ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా ముంబయి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో సల్మాన్‌ ఖాన్‌ పాల్గొన్న విషయం తెల్సిందే. ఆ సమయంలో విజయేంద్ర ప్రసాద్‌ కథ సిద్దం చేస్తే బజరంగీ భాయిజాన్ సీక్వెల్‌ ను చేసేందుకు సిద్దం అన్నట్లుగా ప్రకటించాడు. అతి త్వరలోనే ఆ సినిమా మొదలు అవ్వడం ఖాయం అంటూ అంతా అనుకుంటూ ఉన్న సమయంలో అనూహ్యంగా రచయిత విజయేంద్ర ప్రసాద్‌ దర్శకుడి విషయంలో ట్విస్ట్‌ పెట్టాడు. బజరంగీ భాయిజాన్ సినిమా కు కబీర్‌ ఖాన్ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆయనే సీక్వెల్‌ కు డైరెక్షన్‌ చేస్తాడని చెప్పలేం అన్నట్లుగా విజయేంద్ర ప్రసాద్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఈ సీక్వెల్‌ ను ఎవరి దర్శకత్వంలో చేయాలి అనేది సల్మాన్ ఖాన్‌ ఇష్టం. ఆయన నిర్ణయం అనుసారంగానే సీక్వెల్‌ మొదలు అవుతుంది అన్నట్లుగా అబిప్రాయం వ్యక్తం చేశాడు. కబీర్‌ ఖాన్‌ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌ లను చేపట్టాడు. ఇప్పటికే షూటింగ్‌ దశలో కూడా ఆయన ప్రాజెక్ట్‌ ఉంది. కనుక ఆ సినిమాలను పూర్తి చేసేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. కనుక ముందే ఈ సినిమాను పట్టాలెక్కించాలంటే మరో దర్శకుడితో వెళ్లాల్సి ఉంది. మరి ఆ వేరే దర్శకుడు విజయేంద్ర ప్రసాద్‌ అవ్వకూడదా అనే చర్చ కూడా జరుగుతోందట.

సల్మాన్ ఖాన్ మరియు విజయేంద్ర ప్రసాద్‌ లు తమ అనుభవంతో ఈ సీక్వెల్‌ ను ముందుకు తీసుకు వెళ్తే ఖచ్చితంగా మంచి ఫలితం దక్కుతుంది అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. కాని విజయేంద్ర ప్రసాద్‌ తెరకెక్కించిన ఏ ఒక్క సినిమా సక్సెస్ కాలేదు. కనుక ఆయన సినిమాలకు దర్శకత్వం వహించాలనే ఆలోచనను వదిలేశాడు. కనుక సీక్వెల్‌ కు మరెవ్వరైనా కొత్త దర్శకుడు వర్క్‌ చేస్తాడా అనేది చూడాలి.