పీసీ ఫ్యామిలీలో అత్యంత ధనవంతుడైన జోనాస్ ఎవరు?

Sat Nov 27 2021 19:00:02 GMT+0530 (IST)

Who Is The Richest Jonas In The Pc Family

ప్రియాంక చోప్రా జోనాస్ కుటుంబంలో కోడలు అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కుటుంబంలో జోనాస్ బ్రదర్స్ వినోద రంగంలో గొప్ప సంపాదకులుగా వెలిగిపోతున్నారు. అయితే ఇందులో అత్యంత ధనికుడు ఎవరు? అన్న సర్వే నిర్వహిస్తే.. ఆసక్తికర విషయాలు తెలిసాయి.నిక్ జోనాస్ కెరీర్ పరంగా ఇటీవల ఫుల్ బిజీగా ఉన్నాడు. అతను నాలుగు సోలో ఆల్బమ్ లను విడుదల చేశాడు. టేకిలా బ్రాండ్ ను ప్రారంభించాడు.. బ్రాడ్ వే నిర్మాణంలోకి ప్రవేశించాడు. బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే నటి ప్రియాంక చోప్రాను వివాహం చేసుకున్నాడు. ఇక జో DNCEతో ఎక్కువ సంగీతాన్ని అందించాడు. ది వాయిస్ ఆర్జకుడు.. అతని భార్య గేమ్ ఆఫ్ థ్రోన్స్ సోఫీ టర్నర్ గా పాపులర్. అయితే ఫ్రాంకీ టిక్ టాక్ నుండి తన సంపదను అసాధారణంగా పొందాడు.

2005 నుండి జోనాస్ బ్రదర్స్ డిస్నీ ఛానల్ క్యాంప్ రాక్ (2008) - హన్నా మోంటానా (2006-2011)లో కనిపించిన తర్వాత నౌటీలలో సంగీతం తో ఆర్జకులుగా మారారు. టీవీ స్టార్లుగా ఎదిగారు. ఎనిమిదేళ్ల పాటు త్రయం అభిమానులను ఆకట్టుకున్న తర్వాత సోదరులు 2013లో తమ సొంత వెంచర్ లపై దృష్టి సారించేందుకు కొంత విరామం తీసుకున్నారు. అయితే వారి చివరి 2019 పునఃకలయిక నిజంగా వారు కొత్త శిఖరాలకు చేర్చింది. హిట్ సాంగ్ సక్కర్ బిల్ బోర్డ్ చార్ట్ లో మొదటి స్థానానికి చేరుకుంది. అలా చేసిన మొట్టమొదటి జోనాస్ బ్రదర్స్ పాట. ఐదవ ఆల్బమ్ హ్యాపీనెస్ బిగిన్స్ కూడా చార్ట్ లలో అగ్రస్థానంలో నిలిచింది.

ఇంతకీ వీళ్లలో అత్యంత ధనికుడైన జోనాస్ సోదరుడు ఎవరు? వారి ప్రసిద్ధ జోనాస్ భార్యలు ఎలా పోలుస్తారు? సెలబ్రిటీ నెట్ వర్త్ లోని ఇంటర్నెట్ విజార్డ్స్.. 2021లో పాపులర్ ఫ్యామిలీ తాలూకా నికర ఆస్తుల విలువలను లెక్కించారు. దాని ప్రకారం..

29ఏళ్ల నిక్ జోనాస్ ఆస్తి అంచనా నికర విలువ: US$50 మిలియన్లు. నిక్ బ్యాండ్ పరంగా చిన్నవాడే కావచ్చు. కానీ అతని బ్యాంక్ ఖాతా దండీగా నిండి ఉంది. అతని సోదరులతో అతని బ్యాండ్ ట్రూప్ తో పాటు నిక్ విజయవంతమైన సోలో కళాకారుడు కూడా. ఈ సంవత్సరం అతని నాల్గవ స్టూడియో ఆల్బమ్ `స్పేస్ మ్యాన్`ని విడుదల చేశాడు.

వాస్తవానికి నిక్ తెలివిగల వ్యాపారవేత్త కూడా. ఫ్యాషన్ - పెర్ఫ్యూమ్స్ లో కొత్త వెంచర్ లను ప్రారంభించాడు. అతను విల్లా వన్ అనే టేకిలా బ్రాండ్ ను పొందాడు. బ్రాడ్ వే ఉత్పత్తిలో పాపులరవుతున్నాడు. నిక్ మరియు అతని భార్య ప్రియాంక చోప్రా జోనాస్ దాదాపు US$70 మిలియన్ల నికర ఆస్తులను కలిగి ఉన్నారు. దీనితో వారు అత్యంత సంపన్న జోనాస్ జంటగా నిలిచారు.

32ఏళ్ల జో జోనాస్ ఆస్తుల అంచనా నికర విలువ: US$40 మిలియన్లు. అతను జోనాస్ బ్రదర్స్ రీయూనియన్ తో అభిమానులను మెప్పించక మునుపు అతను తన స్వంత పనిలో ఉన్నాడు. 2011లో సోలో ఆల్బమ్ ను 2016లో ఫంక్-పాప్ బ్యాండ్ DNCEతో ఒక ఆల్బమ్ ను విడుదల చేశాడు. 2017లో జో హిట్ సింగింగ్ కాంపిటీషన్ షో ది వాయిస్‌లో చేరడానికి ముందు మెంటార్ అయ్యాడు. ఈ సంవత్సరం అతను కొరియన్ వార్ మూవీ డివోషన్ లో నటించాడు. నిర్మాతగా చిత్రీకరించడం ప్రారంభించాడు. ఇది 2022లో ప్రదర్శించబడుతుందని భావిస్తున్నారు.

34ఏళ్ల కెవిన్ జోనాస్ ఆస్తుల అంచనా నికర విలువ: US$40 మిలియన్లు.
2012లో బ్యాండ్ విరామం తీసుకున్నప్పుడు.. పెద్ద సోదరుడు కెవిన్ రియాలిటీ టెలివిజన్ షోలోకి ప్రవేశించడానికి సమయాన్ని వృథా చేయలేదు. అతని స్వంత E! రియాలిటీ షో జోనాస్ ను అతని భార్య డేనియల్ తో కలిసి వివాహం చేసుకున్నారు. అతను 2014లో ది సెలబ్రిటీ అప్రెంటిస్ ఏడవ సీజన్ లో కూడా కొద్దిసేపు పనిచేశాడు.

ఈ రోజుల్లో కెవిన్ జోనాస్ వెర్నర్ అనే రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కంపెనీ వ్యవస్థాపకుడు .. కమ్యూనికేషన్/సోషల్ మీడియా సంస్థ ది బ్లూ మార్కెట్ కి CEO కూడా.

39ఏళ్ల ప్రియాంక చోప్రా జోనాస్ ఆస్తుల అంచనా నికర విలువ: US$30-45 మిలియన్లు. 2000లో ప్రపంచ సుందరి పోటీని గెలుచుకున్న తర్వాత ప్రియాంక గొప్ప ఖ్యాతి ని ఘడించారు. ఆమె బాలీవుడ్ తో పాటు ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా మారింది. ప్రియాంక ఒకసారి బ్లూమ్ బెర్గ్ తో మాట్లాడుతూ.. తన సంపాదనను తీసుకుని.. తాను ఖర్చు చేయాలనుకుంటున్న దాంట్లోంచి పొదుపు చేసి దాతృత్వానికి ఇవ్వాలనుకుంటున్నానని తెలిపారు. న్యూయార్క్ ..లాస్ ఏంజెల్స్.. ముంబై ...లండన్ .. గోవాలో గృహాలను కలిగి ఉన్న పోర్ట్ ఫోలియోతో ఆమె ఆస్తిలో ఏది మిగిలి ఉంటే అది పెట్టుబడిగా పెడుతూనే ధాతృత్వ కార్యక్రమాలు చేస్తోంది.

25 ఏళ్ల సోఫీ టర్నర్ ఆస్తుల అంచనా నికర విలువ: US$8 మిలియన్లు బ్రిటీష్ నటి సోఫీ టర్నర్ గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో సన్సా స్టార్క్ పాత్రకు ప్రసిద్ధి చెందింది. దీనిలో ఆమె 2011లో మొదటి సీజన్ నుండి 2019లో చివరి రన్ వరకు కనిపించింది. అప్పటి నుండి ఆమె 2016 X-మెన్: అపోకలిప్స్ లో కూడా పాత్రలు పోషించింది. 2019 డార్క్ ఫీనిక్స్ లోనూ నటించింది. ఈ రోజుల్లో ఆమె భర్త జోతో కలిసి రెడ్ కార్పెట్ ఈవెంట్లు లేని సమయంలో ఆమె యానిమేటెడ్ HBO మ్యాక్స్ సిరీస్ ది ప్రిన్స్ కి గాత్రదానం చేస్తోంది HBO మ్యాక్స్ ట్రూ క్రైమ్ సిరీస్ ది స్టెయిర్ కేస్ ను చిత్రీకరణలో బిజీగా ఉంది.

కుటుంబంలోని మిగిలిన వారిలాగే టర్నర్ ఆమె భర్త కూడా ఆస్తి పరంగా కొన్ని దెబ్బలు తిని మునిగిపోయారు. ఈ జంట ఇటీవల తమ ఎన్ సినో.. కాలిఫోర్నియా ఎస్టేట్ ను US$15.2 మిలియన్లకు విక్రయించింది. న్యూయార్క్ లో ఒక కాండోను US$5.9 మిలియన్లకు అమ్మేశారు. ఆ తర్వాత US$11 మిలియన్లకు మయామిలో వాటర్ ఫ్రంట్ ఇంటిని కొనుగోలు చేసారు.

35 ఏళ్ల డేనియల్ జోనాస్ ఆస్తుల అంచనా నికర విలువ: US$5 మిలియన్లు. డేనియల్ 2012లో హబ్బీ కెవిన్ తో కలిసి ఇ! మ్యారీడ్ టు జోనాస్ లో నటించినందుకు బాగా పేరు పొందింది. అప్పటి నుండి 35 ఏళ్ల డేనియల్ బర్త్ స్టోన్స్ ఆధారంగా జ్యువెలరీ కంపెనీ డేనియల్ జోనాస్ కో.ని స్థాపించారు. జోనాస్ సమూహంలో అత్యంత ధనవంతురాలు కాకపోయినా బెస్ట్ ఎర్నర్ గా ఉంది. జోనాస్ కుటుంబంలో వివాహం చేసుకునే ముందు డేనియల్ హెయిర్ డ్రెస్సర్ గా పనిచేసింది. కాబట్టి ఆమె ఇప్పటికీ జీవితంలో విజయం సాధిస్తోంది. ప్రియానిక్ జోనాస్ ఈ కుటుంబంలో అత్యంత ధనికులుగా అవతరించారు ఇప్పటికి.