ఏప్రిల్ లో బాక్సాఫీస్ వద్ద ఏయే సినిమాలు సౌండ్ చేయబోతున్నాయి..?

Tue Feb 23 2021 05:00:01 GMT+0530 (IST)

Which movies are going to sound at the box office in April

టాలీవుడ్ లో మళ్ళీ సినిమాల సందడి మొదలైంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ నెలలో అనేక సినిమాలు ఆడియన్స్ ముందుకు రానున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించి పవన్ ఆ తరువాత దిల్ రాజు తప్పితే ఇందులో యాక్ట్ చేస్తున్న హీరోయిన్లు ఎవరో.. ఈ సినిమా దర్శకుడు ఎవరో కూడా నార్మల్ ఆడియన్స్ కి తెలియదు. అయితే పవన్ చాలా గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించే చిత్రం కావడంతో ఫ్యాన్స్ మాత్రం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ నెలలో పవర్ స్టార్ సినిమా విడుదల ఉండటంతో మిగతా సినిమాల మీద జనాలు పెద్దగా ఫోకస్ చేయకపోవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఇదే క్రమంలో యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన 'లవ్ స్టొరీ' సినిమా ఏప్రిల్ 16న విడుదల కానుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. నేచురల్ స్టార్ నాని - శివ నిర్వాణ కాంబినేషన్ లో రూపొందుతున్న 'టక్ జగదీష్' చిత్రం ఏప్రిల్ 23న రిలీజ్ కానుంది. టీజర్ సాంగ్స్ ట్రైలర్ అంటూ జగదీష్ నాయుడు బాగానే సౌండింగ్ చేస్తున్నాడు.

ఇకపోతే ఏప్రిల్ 2న గోపీచంద్ - సంపత్ నంది కాంబినేషన్ లో వస్తున్న 'సీటీమార్' సినిమా రిలీజ్ కానుంది. అలానే దగ్గుబాటి రానా - సాయి పల్లవి కలిసి నటిస్తున్న 'విరాటపర్వం' చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయనున్నారు. దిల్ రాజు సమర్పణలో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కనున్న 'పాగల్' సినిమాని కూడా అదే నెల 30న రిలీజ్ చేస్తున్నారు. వీటితో పాటు కార్తీ - రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న 'సుల్తాన్'.. పునీత్ రాజ్ కుమార్ నటించిన 'యువరత్న' అనే డబ్బింగ్ సినిమాలు కూడా ఏప్రిల్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ క్రేజీ మూవీస్ లో ఎన్ని బాక్సాఫీస్ వద్ద సౌండ్ చేస్తాయో చూడాలి.