Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ కు ఇష్టమైన పవన్ సినిమా ఏది?

By:  Tupaki Desk   |   26 Nov 2021 9:32 AM GMT
ఎన్టీఆర్‌ కు ఇష్టమైన పవన్ సినిమా ఏది?
X
యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో తో ప్రేక్షకులకు మరింతగా చేరువ అవుతున్నాడు. తన వ్యక్తిగత విషయాల నుండి మొదలుకుని తన సినీ కెరీర్ లోని అనేక విషయాలను ఈ షో ద్వారా ఎన్టీఆర్‌ షేర్‌ చేసుకుంటూ ఉన్నాడు. ఎన్టీఆర్ ఈ షో కు మొదటి సారి హోస్టింగ్ చేస్తున్నా కూడా ప్రేక్షకులను బాగా ఎంటర్‌ టైన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నాడు. కాని షో కు నిర్వాహకుల క్రియేటివిటీ లోపమో లేదా మరేంటో కాని ఆశించిన స్థాయిలో రేటింగ్ దక్కడం లేదు. వచ్చే నెలలో ఈ షో మొదటి సీజన్ ముగించబోతున్నట్లగా సమాచారం అందుతోంది. కంటెస్టెంట్స్ తో పలు విషయాలను మాట్లాడుతూ వారిని కూల్‌ చేస్తూ.. తాను తన జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ చిల్‌ అవ్వడమే కాకుండా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేస్తూ ఎన్టీఆర్‌ షో ను అద్బుతంగా సాగిస్తున్నాడు.

తాజాగా ఒక కంటెస్టెంట్‌ తో మాట్లాడుతున్న సమయంలో తనకు పవన్‌ కళ్యాణ్‌ నటించిన సినిమా ల్లో 'తొలి ప్రేమ' సినిమా అంటే చాలా ఇష్టం అంటూ ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో ఇద్దరు హీరోల మద్య ఎంతటి పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతటి పోటీ ఉన్న కూడా హీరోల మద్య సక్యత ఉంటుంది. అంతా కూడా స్నేహితులుగా ఉంటారు. ఈ షో లో ఎన్టీఆర్‌ మహేష్‌ స్పెషల్‌ ఎపిసోడ్‌ లో పవన్‌ ను వీడియో కాల్‌ ద్వారా లైన్ లోకి తీసుకు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ ఎపిసోడ్‌ గురించి అంతా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో తొలి ప్రేమ సినిమా అంటే చాలా ఇష్టం అంటూ ఎన్టీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఇద్దరు హీరోల అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉంది.

ఎన్టీఆర్‌ ఎవరు మీలో కోటీశ్వరులు షో షూటింగ్ ను పూర్తి చేసి ఇటీవలే విదేశీ పర్యటనకు వెళ్లాడు. కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను ఇప్పటికే మొదలు పెట్టాల్సి ఉన్నా కూడా ఎన్టీఆర్‌ చేతికి చిన్న ఆపరేషన్‌ అవ్వడంతో షూటింగ్ కాస్త ఆలస్యం అవుతోంది. మరో వైపు ఎన్టీఆర్‌ నటించిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. సంక్రాంతికి ముందు రాబోతున్న ఈ సినిమా ను ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ను వచ్చే నెల ఆరంభం లో షురూ చేస్తారట. అప్పటి వరకు ఎన్టీఆర్‌ కుటుంబంతో సహా హాలీడేస్ ను ముగించుకుని ఇండియాకు తిరిగి రాబోతున్నాడు. ఆర్ ఆర్‌ ఆర్ సినిమా తో ఎన్టీఆర్‌ పాన్ ఇండియా స్టార్‌ గా నిలవడం ఖాయం అంటూ అభిమానులు అంటున్నారు.