Begin typing your search above and press return to search.

స్వీటీ కొత్త సినిమా కబురు ఇంకెప్పుడు..??

By:  Tupaki Desk   |   14 Jan 2021 3:30 AM GMT
స్వీటీ కొత్త సినిమా కబురు ఇంకెప్పుడు..??
X
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే నిశ్శబ్దం సినిమాను డిజిటల్ విడుదల చేసి అభిమానులను నిరాశపరిచింది. అయితే నిజానికి భాగమతి మూవీ సరైన హిట్ అందించకపోవడంతో భారీ గ్యాప్ తీసుకొని మల్టీలాంగ్వేజ్ ఫిల్మ్ నిశ్శబ్దం ఓకే చేసింది. లాక్ డౌన్ లో విడుదలైన ఈ సినిమాకు భారీ హైప్ ఏర్పడింది. తీరా విడుదలయ్యాక సినిమా పూర్తిగా కనిపించకుండా పోయింది. ట్రైలర్ లతో బజ్ క్రియేట్ చేసిన సినిమా డిజిటల్ విడుదల అయ్యాక ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక ఆ సినిమా తర్వాత అనుష్క తదుపరి సినిమా ఎవరితో.. ఏంటి? అనే ప్రశ్నలు ఇండస్ట్రీలో, అభిమానులలో రేకేత్తుతూనే ఉన్నాయి.

అయితే గత కొన్నిరోజులుగా అనుష్క తదుపరి సినిమా ఈ డైరెక్టర్ తోనే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అనుష్క తదుపరి సినిమాను 'రారా కృష్ణయ్య' ఫేమ్ పి.మహేష్ దర్శకత్వంలో చేయబోతుందని విపరీతంగా ఫిల్మ్ నగర్ వర్గాలలో టాక్ స్ప్రెడ్ అవుతోంది. అంతేగాక ఈ సినిమాను యూవి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తారని మరికొన్ని కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ అనుష్క అభిమానులు మాత్రం చాలా నిరాశలో ఉన్నారట. ఎందుకంటే తమ ఫేవరేట్ హీరోయిన్ ఒక్కో సినిమాకి ఇంత టైం తీసుకోవడమే కాకుండా ప్లాప్ సినిమాలను అందిస్తుందని వాపోతున్నారట. మళ్లీ ఇంతవరకు ఏ సినిమా అనేది క్లారిటీ ఇవ్వలేదు. చూడాలి మరి ఇకనైనా తన తదుపరి సినిమా పై అధికారిక ప్రకటన బయటికి వస్తుందేమో..!!