బిల్డింగ్ కట్టేదెపుడు? విశాల్ పెళ్లాడేదెపుడు?

Sun Dec 04 2022 05:00:02 GMT+0530 (India Standard Time)

When will the building be constructed? When will Vishal get married?

ప్రతిసారీ అభిమానుల నుంచి యాక్షన్ హీరో విశాల్ కి ఒక ప్రశ్న కామన్ గా ఎదురవుతుంటుంది. అది మీ పెళ్లెప్పుడు?  కానీ దానికి అతడు సమాధానం దాట వేస్తూనే ఉన్నాడు. ఇటీవల విశాల్ ఒక అందమైన కథానాయికను పెళ్లాడేందుకు సిద్ధమయ్యాడని కథనాలొచ్చాయి. ఇంతకీ ఎవరా అమ్మాయి..? అతడికి ఇంతకుముందే నిశ్చితార్థం అయ్యింది కదా.. కొన్నాళ్ల పాటు ప్రేమాయణం సాగించి తన మనసుకు నచ్చిన అమ్మాయిని ఎంపిక చేసుకున్నాడు .. కానీ ఆ ప్రేమకథ మలుపులు తిరిగి చివరికి నిశ్చితార్థం తర్వాత క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత విశాల్ ప్రేమాయణాలపై చర్చ సాగింది. కానీ అమ్మాయి ఎవరో రివీల్ కాలేదు. అయితే విశాల్ పెళ్లెప్పుడు? అన్న సందేహం ఇంకా అలానే అభిమానులకు ఉంది. ఇలాంటి ఒక ప్రశ్న ఇప్పుడు అతడికి సామాజిక మాధ్యమాల్లో నిత్యం ఎదురవుతూనే ఉంది. దానికి విశాల్ సమాధానం ఏమిటీ అంటే?  వివరాల్లోకి వెళ్లాలి.తెలుగు-తమిళ చిత్రసీమల్లో మోస్ట్ పవర్ ఫుల్ యాక్షన్ హీరోగా విశాల్ తనకంటూ ఒక రేంజుందని నిరూపించాడు. భయం బెరుకు అన్నవే లేని హీరోగా ప్రూవ్ చేసాడు. సినిమాలోని ఫైట్ సీన్స్ లో ఎక్కువ రిస్క్ లు తీసుకుంటాడు. గత చిత్రం 'లాఠీ' సెట్స్ లో షాట్ ల సమయంలో గాయాల కారణంగా ఆస్పత్రికి వెళ్లాడు. సెట్లో గాయాల కారణంగా అతడు కేవలం 2022లో మూడుసార్లు ఆసుపత్రి పాలయ్యాడు.

ఇక రియల్ లైఫ్ లో విశాల్ రియల్ ఛాలెంజ్ ల గురించి తెలిసిందే. నడిగరసంఘం మాజీ అధ్యక్షుడు నటుడు శరత్ కుమార్ తోనూ అతడి బిగ్ ఫైట్ అప్పట్లో హీట్ పుట్టించింది. నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శి హోదాలో నడిగర్ సంఘం భవనం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని వ్యక్తిగతంగా విశాల్ ఇంతకుముందు ప్రమాణం చేశారు. ఆర్థిక సమస్యలు.. కోర్టు కేసులు.. కరోనావైరస్ మహమ్మారి కారణంగా భవంతి నిర్మాణం సగంలో ఆగిపోయింది.

2019 లో విశాల్ ప్రేమలో పడ్డాడు.. ఆంధ్రాకు చెందిన నటి అనిషా అల్లా రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు. అయితే ఆరు నెలల తరువాత వారు ఇతర కారణాలతో దూరమయ్యారు. కానీ ఇంతలోనే సీన్ మారింది. విశాల్ తాజా ఇంటర్వ్యూలో తనకు కుదిరిన పెళ్లి వర్కవుట్ అవుతుందనే నమ్మకం లేదని పేర్కొన్నాడు. తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని.. ఆమె ఎవరనేది త్వరలో వెల్లడిస్తానని కూడా అప్పట్లో హింట్ ఇవ్వడంతో మరోసారి అతడి పెళ్లిపై ఊహాగానాలు సాగాయి. కానీ అతడు అమ్మాయి పేరు అయితే చెప్పలేదు.

'లాఠీ' సినిమా తర్వాత విశాల్ ఇటీవల వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో 'మార్క్ ఆంటోనీ' తో పాఉ.. తన స్వీయ దర్శకత్వ తొలి చిత్రంగా 'తుప్పరివాలన్ 2'లోనూ నటిస్తున్నారు.

లవ్ లైఫ్ విషయానికి వస్తే.. గతంలో విశాల్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. గుంకీ హీరోయిన్ లక్ష్మీ మీనన్ తోనూ వరుసగా సినిమాలు చేసిన విశాల్ తనతోనూ ఎఫైర్ సాగించాడని గుసగుసలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత లాఠీ హీరోయిన్ లలో ఒకరైన అభినయతో విశాల్ పెళ్లి అంటూ ఒక పుకార్ షికార్ చేయగా దానిని విశాల్ ఖండించారు.

రియల్ లైఫ్ లో రియల్ ఛాలెంజర్ గా నిరూపించిన విశాల్ ప్రస్తుతం ఎవరితో ప్రేమలో పడ్డాడో ఇంకా వెల్లడించలేదు. అయితే అతడు మాత్రం ఒక మాటకు కట్టుబడి ఉన్నాడు. దాదాపు 3500 మంది ఆర్టిస్టులతో అతి పెద్ద ఆర్టిస్టుల సంఘంగా పాపులరైన నడిగర సంఘం సొంత బిల్డింగ్ నిర్మాణం పూర్తయ్యే వరకూ తాను అస్సలు పెళ్లాడేదే లేదని చెప్పాడు. ఆ మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని వెల్లడించాడు. ఆర్టిస్టుల్లో చాలా మంది చితికిన బతుకులు ఇప్పటికీ అలానే ఉన్నాయి. అవి మారలేదు. వారికోసం సొంత గూడు సరైన  జీవితాన్ని ఇవ్వాలని సంక్షేమ కార్యక్రమాలు చేయాలని అతడు ప్రకటించాడు. ఇక తన పెళ్లి మాత్రం నడిగరసంఘం బిల్డింగ్ పూర్తయ్యాకే అని ఫిక్సయ్యాడు. ఇటీవల ఓ నెటిజన్ సోషల్ మీడియాలో విశాల ని పెళ్లి గురించి ప్రశ్నించగా.. మళ్లీ ఇదే సమాధానం చెప్పడంతో ఇప్పట్లో విశాల్ పెళ్లి లేదని క్లారిటీ వచ్చేసింది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.