Begin typing your search above and press return to search.

నాని మీద త్రివిక్రమ్ కన్ను ఎప్పుడు పడాలి..!

By:  Tupaki Desk   |   24 March 2023 3:00 PM GMT
నాని మీద త్రివిక్రమ్ కన్ను ఎప్పుడు పడాలి..!
X
నేచురల్ స్టార్ నాని దసరా సినిమా మార్చి 30న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీ బిజీగా ఉన్నాడు నాని. పాన్ ఇండియా వైడ్ తన సినిమా రిలీజ్ అవుతున్న కారణంగా నార్త్ సైడ్ ఎక్కువ దృష్టి పెట్టాడు నాని. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో స్టార్ డైరెక్టర్స్ తో పనిచేయాలని ఉందన్న ఆలోచన బయట పెట్టాడు నాని. 15 ఏళ్ల కెరీర్ లో 29 సినిమాలు చేసిన నాని స్టార్ డైరెక్టర్స్ తో సినిమా చేసింది చాలా తక్కువ. నాని కెరీర్ లో ఎక్కువ శాతం యువ దర్శకులకు, నూతన దర్శకులకు ఛాన్స్ ఇచ్చాడు.

అయితే దసరా తర్వాత తన ప్లాన్ మార్చబోతున్నాడు నాని. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ తో పనిచేయాలని ఉందని అన్నారు. ముఖ్యంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో తనకు పనిచేయాలని ఉందని అన్నారు నాని.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో నాని మరో హీరోతో కలిపి ఒక మల్టీస్టారర్ ప్లాన్ చేశారు. కానీ అది ఎందుకో సెట్స్ మీదకు రాలేదు. కానీ నాని మాత్రం త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయాలని ఉందన్న కోరికను బయటపెట్టాడు.

అయితే త్రివిక్రమ్ ప్రస్తుతం వరుస స్టార్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. మహేష్ తో 28వ సినిమా చేస్తున్న త్రివిక్రమ్ ఆ తర్వాత అల్లు అర్జున్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. తర్వాత ఎన్.టి.ఆర్ సినిమా ఉంటుందని టాక్.

మరి వరుస స్టార్స్ తో చేసే త్రివిక్రం నేచురల్ స్టార్ తో సినిమా చేస్తాడా అన్నది ఆలోచించాలి. అదేముంది నానికి సరిపడే కథ దొరికితే త్రివిక్రమ్ తప్పకుండా నానితో చేసే ఛాన్స్ ఉంటుంది. నితిన్ తో అ ఆ తీసినట్టుగా నానితో కూడా త్రివిక్రమ్ సినిమా చెయ్యొచ్చు.

నానితో త్రివిక్రమ్ సినిమా చేస్తే మాత్రం నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని నాని ఫ్యాన్స్ అంటున్నారు. పరిశ్రమలో ఎలాంటి పరిచయాలు లేకుండా ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి ఆ తర్వాత హీరోగా మారి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు నాని. దసరా హిట్ కొట్టి నాని తన స్టామినా ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.