ఫ్యామిలీ మ్యాన్ OTTలో ఒక గొప్ప సంచలనం. పలు ఎపిసోడ్లతో కూడుకుని రెండు భాగాలుగా ఇప్పటికే ఈ సిరీస్ అలరించింది. భారతీయ వెబ్ సిరీస్ లలో అతిపెద్ద విజయం సాధించిన సిరీస్ గా ఈ ఫ్రాంఛైజీకి ప్రత్యేక గుర్తింపు గౌరవం ఉన్నాయి. అంతేకాదు.. ఫ్యామిలీమ్యాన్ కి సృష్టికర్తలు మన తెలుగు వారు కావడం ఇక్కడ గర్వించదగినది.
జాతీయ ఉత్తమ నటుడు మనోజ్ బాజ్పేయి రెండు సీజన్ లలో నటించారు. సీజన్ 1 సీజన్ 2లో జాతీయ ఉత్తమనటి ప్రియమణి నటించగా రెండో సీజన్ లో సమంత రూత్ ప్రభు నటనకు జేజేలు పలికారు. సెకండ్ సీజన్ 2021లో ప్రీమియర్ అయినప్పటి నుండి మూడవ సీజన్ రాకపై అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
ట్యాలెంటెడ్ రాజ్ అండ్ డికె ఇటీవలే ఫర్జీతో మరో బంపర్ హిట్ అందుకున్నారు. ఓటీటీలో ఎదురేలేని దర్శకనిర్మాతలుగా ఓ వెలుగు వెలుగుతున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరి నేతృత్వంలోని 'ది ఫ్యామిలీ మ్యాన్ 3' అవకాశం గురించి ఇటీవల బాజ్ పేయిని ప్రశ్నించగా తనదైన శైలిలో అతడు అసలు విషయం వెల్లడించారు.
''ఆజ్ హీ సుబహ్ ఏక్ చిదియా ఉడ్తే హుయే మేరే ఖిడ్కీ పే బైతీ ఔర్ ఉస్నే కహా షాయద్ షూటింగ్ సాల్ కే అంత్ మే కర్ సక్తే హై హమ్లోగ్. ఔర్ అగర్ పైసే బచ్నే కే బాద్ సబ్ సాహి హో గయా తో షాయద్ కర్ హీ లేంగే.'' (ఈ రోజు ఉదయం ఒక చిన్న బర్డీ వచ్చి నా కిటికీ దగ్గర కూర్చుని.. బహుశా ఈ సంవత్సరం చివర్లో షూటింగ్ ప్రారంభమవుతుందని.. మీరంతా డబ్బు ఆదా చేయగలిగితే బాగుంటుందని సూచించించింది. అప్పుడు ఖచ్చితంగా చేస్తారు) అని నర్మగర్భంగా సిరీస్ ప్రారంభమయ్యేదెపుడో చెప్పేశారు.
మనోజ్ గొప్ప కవి.. కథకుడు. అతడు ఇప్పటికీ స్టార్ యాక్టర్ అయినా కానీ తనకు అవకాశాలు కావాలని ఇంకా దర్శకులను కోరుతూనే ఉంటానని ఒప్పుకున్నాడు. అతను ఉదయం 5 గంటలకు నిద్రలేచి ధ్యానం - పరుగు - ప్రార్థనలతో క్రమశిక్షణతో కూడిన దినచర్యను కలిగి ఉన్నాడు.
అతడు తన నటనతో ప్రవర్తనతో క్రమశిక్షణతో అందరినీ ప్రేరేపించాడు. మనోజ్ ఇటీవల గుల్మోహర్ చిత్రంలో కనిపించాడు. అతను తదుపరి ది ఫ్యామిలీ మ్యాన్ 3తో పాటు డెస్పాచ్ - జోరామ్ లో కనిపించనున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.