Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసు: వాట్సాప్ చాటింగ్ ని సాక్ష్యంగా పరిగణించలేమని పేర్కొన్న కోర్ట్..!

By:  Tupaki Desk   |   20 Nov 2020 6:15 AM GMT
డ్రగ్స్ కేసు: వాట్సాప్ చాటింగ్ ని సాక్ష్యంగా పరిగణించలేమని పేర్కొన్న కోర్ట్..!
X
డ్రగ్స్ కేసులో ఆస్ట్రేలియా ఆర్కికెట్ట్ పౌల్ బార్టెల్స్‌ ను గతవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ గురించి వాట్సాప్ చాటింగ్ లో చర్చించినట్టు బయటపడటంతో అతడిని డ్రగ్స్ అమ్మాడనే ఆరోపణలతో ఎన్డీపీసీ అధికారులు అరెస్ట్ చేసి విచారించారు. అయితే ఈ కేసులో పౌల్ బార్టెల్స్‌ కు నార్కోటిక్ డ్రగ్స్, సైకోథెరపిక్ సబ్‌ స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. వాట్సాప్ చాటింగ్ సాక్ష్యాలుగా పరిగణించలేమని.. నిందితుల నుంచి ఎటువంటి ఆధారాలు, నిషేధిత పదార్థాలు లభించలేదని.. వాట్సాప్ చాట్ తప్ప డ్రగ్స్ అమ్మినట్టు, సరఫరా చేసినట్టు స్పష్టమైన ఆధారాలు లేవు కాబట్టి అతడికి బెయిల్ నిరాకరించడం సమంజసం కాదని ఎన్సీబీ ప్రత్యేక కోర్టు వ్యాఖ్యానించింది.

ఈ సందర్భంగా డ్రగ్స్ కేసులో బార్టెల్స్ పాత్రపై భవిష్యత్తులో ఒకవేళ ఏవైనా ఆధారాలను ఎన్సీబీ అధికారులు సేకరిస్తే తర్వాత పరిస్థితి భిన్నంగా ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా నిందితుడిని అరెస్టు చేసిన తరువాత, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టిన అధికారులు అతడిని కస్టడీకి కోరలేదు.. నిందితులను విచారించడానికి, తదుపరి దర్యాప్తునకు ఎన్‌సీబీ వద్ద ఎటువంటి ఆధారాలు అందుబాటులో లేవని తెలియజేస్తుంది.. తాను డ్రగ్స్ తీసుకోవడం లేదని నిందితుడు తెలిపాడని న్యాయమూర్తి తెలిపారు.

బార్టెల్స్ తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదులు.. గత ఆరేళ్లుగా దేశంలో ఉంటున్న బార్టెల్స్ ఎటువంటి వివాదాల్లో చిక్కుకోలేదని, తప్పుడు ఆరోపణలతో అతడిని జైల్లో పెట్టారని వాదించారు. ఈ కేసు అతడి జీవితం, వృత్తి, భవిష్యత్తు అవకాశాలను నాశనం చేస్తుందని న్యాయస్థానానికి వివరించారు. కాగా, బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ మరణం కేసుతో దీనికి సంబంధం ఉన్నట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనుమానిస్తోంది. అయితే నిందితుడి అదుపులోకి తీసుకున్న సమయంలో అతడి నివాసంలో అధికారులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. కాకపోతే వాట్సాప్ లో డ్రగ్స్ గురించి చర్చించినట్టు తెలిపారు. వాట్సాప్ చాట్ లో డ్రగ్స్ గురించి డిస్కషన్ చేశారనే ఆరోపణలతో పలువురు సెలబ్రిటీలను ఎన్సీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.