లంకలో మెరిసిన టాలీవుడ్ చందమామ

Fri Apr 19 2019 21:56:35 GMT+0530 (IST)

Whats Kajal Doing In A Casino?

ఒకవైపు హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి 'సినిమా ఫ్లాప్ అయింది కదా' అని నిర్మాత నుండి తన పెండింగ్ రెమ్యూనరేషన్ తీసుకోదు..  కాస్మెటిక్స్  కంపెనీ వారు వచ్చి రెండు కోట్లు ఇస్తాం.. ఫేస్ క్రీమ్ కు అంబాజిడర్ గా వ్యవహరించండి అంటే.. నేను ఫేస్ క్రీములు పూసుకోను కాబట్టి ప్రమోషన్ చేయను అని 'రెండు ఖోట్లు' వద్దంటుంది.. కాని అందరూ 'ఫిదా' బ్యూటీలలాగా ఉండరు.  ఎక్కువమంది కాజల్ అగర్వాల్ లాగా ఉంటారు.నిజానికి కాజల్ అగర్వాల్ ను అందరూ స్టార్ హీరోయిన్ అనుకుంటారు కానీ అంతకంటే ఎక్కువగా బిజినెస్ వుమన్ అని అని సన్నిహితులు జోక్ చేస్తుంటారట.  డబ్బు సంపాదించడం అనే కళను నరనరాన ఒంటబట్టించుకున్న ఉత్తరాది భామ కాజల్ అని టాక్ ఉంది.  రీసెంట్ గా కాజల్ అగర్వాల్ శ్రీలంక కు పయనమైంది.  అక్కడ ఒక క్యాసినోలో సందడి చేసింది.  ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.   ఇంతకీ విషయం ఏంటంటే ఈ నెల15 నుంచి రవితేజ హీరోగా తెరకెక్కే 'తెరి' రీమేక్ లో నటించాల్సి ఉంది.  ఆ సినిమాకు తన కాల్ షీట్స్ ఇచ్చేసింది. కానీ ఆ సినిమా అనుకోకుండా క్యాన్సిల్ కావడంతో తనకు ఫ్రీ టైమ్ దొరికింది. దీంతో ఏప్రిల్ 13  న శ్రీలంకకు వెకేషన్ కోసం వెళ్ళింది.  అక్కడ బాలీస్ క్యాసినోలో కస్టమర్లతో కలిసి సందడి చేసింది.. కబుర్లు చెప్పింది. ఊరికే ఫన్ కోసం ఇదంతా చేసిందని మీరనుకుంటే శ్రీలంకలో చేసే సింహళీయుల పప్పులో కాలేసినట్టే.  బాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా తమ కస్టమర్లతో గడిపినందుకు నిర్వాహకులు భారీగా డబ్బు ముట్టజెప్తారట.  అది సంగతి.

మామూలుగానే సెలబ్రిటీలకు మంచి ఫీజు ఇస్తారు. పైగా అదే సమయంలో సింహళీయుల ఉగాది కావడంతో మరింత స్పెషల్ అకేషన్ గా మారింది.  ఏప్రిల్ 13..14 తేదీలలో ఇలా వారితో క్యాసినోలో సరదాగా గడిపి బాగానే ఫీజు పుచ్చుకుందట.  ఈ తతంగం అయిన తర్వాత తన ఫ్యామిలీతో వెకేషన్ ను కంటిన్యూ చేసిందట.  ద్యావుడా.. మా అమాయకపు సౌత్ జనాలకు కాజల్ లాగా ఈ డబ్బు సంపాదించే కళ ప్రసాదించు తండ్రీ.. నీకు పుణ్యం ఉంటుంది!