వైట్ల గారు కాస్త ఆలోచించండి.. పరువు పోగొట్టుకోవద్దు

Tue Feb 25 2020 14:00:57 GMT+0530 (IST)

What's Brewing Between Srinu Vaitla And Megastar Chiranjeevi?

చిన్న చిత్రాలతో కెరీర్ ను ఆరంభించిన శ్రీనువైట్ల పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు. చిరంజీవి.. మహేష్ బాబు.. ఎన్టీఆర్.. చరణ్ వంటి స్టార్స్ తో సినిమాలు చేసిన ఈయన ప్రస్తుతం చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. వరుసగా ఫ్లాప్స్ వస్తున్నా కూడా పట్టువదలని విక్రమార్కుడి తరహాలో సినిమా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయిదు ఫ్లాప్ ల తర్వాత కూడా ఈయన సూపర్ స్టార్ మహేష్ బాబు.. మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్స్ తో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేయడం ఆశ్చర్యంగా ఉంది.మొన్నటికి మొన్న మహేష్ బాబును కలిసిన శ్రీనువైట్ల కథ వినిపించాడు అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని కలిసి కథ చెప్పినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. వీరిద్దరితో కూడా శ్రీనువైట్ల గతంలో వర్క్ చేశాడు. మహేష్ బాబుకు దూకుడు వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఆ విశ్వాసంతో అయినా వీరు మళ్లీ ఛాన్స్ ఇస్తారేమో అనే ఉద్దేశ్యంతో శ్రీను వైట్ల మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది.

మహేష్ బాబు మరియు చిరంజీవిలు శ్రీనువైట్ల చెప్పిన కథలు విన్నారని.. వారి నిర్ణయాన్ని మాత్రం ఇంకా చెప్పలేదని తెలుస్తోంది. వారు ఖచ్చితంగా శ్రీనువైట్లకు ఓకే చెప్పే పరిస్థితి లేదని.. ప్రస్తుతం శ్రీనువైట్ల ఉన్న పరిస్థితుల్లో ఆయన్ను నమ్మడం అంటే మామూలు విషయం కాదని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఖచ్చితంగా వారిద్దరు కూడా కొన్ని రోజుల వరకు నానబెట్టి ఆ తర్వాత సారీ చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. అయిదు వరుస ఫ్లాప్స్ తర్వాత కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు.. చిన్న హీరోలతో కొత్త హీరోలతో సినిమాలు తీసి మళ్లీ నిన్ను నీవు నిరూపించుకో. ఈ విషయమై కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకో వైట్ల.. స్టార్స్ వద్దకు వెళ్లి పరువు పోగొట్టుకోకు అంటూ వైట్ల కు నెటిజన్స్ సలహా ఇస్తున్నారు.