Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ త‌రువాత య‌ష్ నెక్స్ట్‌ ప్టెప్ ఏంటీ?

By:  Tupaki Desk   |   24 May 2022 3:30 PM GMT
కేజీఎఫ్ త‌రువాత య‌ష్ నెక్స్ట్‌ ప్టెప్ ఏంటీ?
X
కేజీఎఫ్ సినిమాల‌తో క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ కెరీర్ ఒక్క సారిగా మారిపోయింది. క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో సాధార‌ణ స్థాయి హీరోగా వున్న య‌ష్ ను కేజీఎఫ్ ఊహించ‌ని విధంగా పాన్ ఇండియా స్టార్ ని చేసింది. దేశ వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యేలా అత‌నికి ఫ్యాన్ బేస్ పెరిగేలా చేసింది. 2018లో విడుద‌లైన `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1` కేవ‌లం 250 కోట్లు మాత్రమే వ‌సూలు చేస్తే చాప్ట‌ర్ 2 ఏకంగా 1200 కోట్లు పై చిలుకు వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది.

హిందీ బెల్ట్ లో ఏకంగా రూ. 400 కోట్ల‌కు మించి వ‌సూళ్లని రాబ‌ట్టి అక్క‌డి స‌రికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఊహించ‌ని ప‌రిణామాల‌కు హీరో య‌ష్ తో పాటు ఆయ‌న అభిమానులు ప‌ట్ట‌రాని ఆనందంతో ఈ ఆనంద క్ష‌ణాల‌ని సెల‌బ్రేట్ చేసుకుంటున్నార‌ట‌. ఊహించ‌ని విధంగా స్టార్ డ‌మ్ సొంతం కావ‌డంతో య‌ష్ ఈ ఫేజ్ ని ఎంజాయ్ చేస్తున్నార‌ట‌. ఒకే ఒక్క మూవీతో దేశ వ్యాప్తంగా క్రేజ్‌ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకోవ‌డంతో య‌ష్ చాలా హ్యాపీగా ఫీల‌వుతున్నార‌ట‌.

ఇదిలా వుంటే ఈ మాసీవ్ హిట్ త‌రువాత య‌ష్ నెక్స్ట్ స్టెప్ ఏంటీ? అన్న‌ది ఇప్ప‌డు ప్ర‌ధాన చ‌ర్చ‌గా మారింది. ఈ రేంజ్ పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత య‌స్ ఏ సినిమా చేయ‌బోతున్నాడు? .. ఎవ‌రితో చేయ‌బోతున్నాడు? .. ఎలాంటి సినిమా చేయ‌బోతున్నాడు? .. డైరెక్ట‌ర్ ఎవ‌రు? అనే విష‌యాలు ప్ర‌స్తుతం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. అయితే య‌ష్ మాత్రం చాలా సింపుల్ గా మ‌ళ్లీ త‌ను క‌న్న‌డ సినిమాతోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాన‌ని క్లారిటీ ఇచ్చేశాడు.

అంటే మ‌ళ్లీ `కేజీఎఫ్ 3`తోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడ‌న్న మాట‌. 2018లో కేజీఎఫ్ 1 ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఆ మూవీ త‌రువాత కూడా య‌ష్ మ‌రో సినిమా చేయ‌లేదు. త‌న విలువైన స‌మ‌యాన్నంతా `కేజీఎఫ్ 2` కోస‌మే కేటాయించాడు. ఏ ప్రాజెక్ట్ ని కూడా అంగీక‌రించ‌లేదు. ఈ మూవీ హ్యూజ్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌డంతో మ‌ళ్లీ దీనికి సీక్వెల్ గా రానున్న `కేజీఎఫ్ 3` కోస‌మే య‌ష్ ఎదురుచూడ‌బోతున్నాడ‌ట‌.

ఈ మూవీ ప‌ట్టాలెక్కాలంటే దాదాపు మూడేళ్లు వేచి చూడ‌క త‌ప్ప‌దు. `కేజీఎఫ్` ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ప్ర‌స్తుతం ప్ర‌భాస్ తో `స‌లార్‌` మూవీ చేస్తున్నారు. ఇది 2023లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. దీని త‌రువాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో సినిమాని పూర్తి చేయాలి.

ఇటీవ‌లే ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని కూడా విడుద‌ల చేశారు. ఇది పూర్త‌యి ప్రేక్ష‌కుల ముందుకు 2024లో రానుంది. ఆ త‌రువాతే `కేజీఎఫ్ 3` సెట్స్ పైకి వెళ్ల‌నుంది. అంటే ఈ మూవీ 2024లో సెట్స్ పైకి వెళితే.. 2025 లో ప్రేక్ష‌క‌లు ముందుకొస్తుంద‌న్న‌మాట అంటే ఈ మూవీ కోసం మూడేళ్లు వేచి చూడ‌క త‌ప్ప‌ద‌న్న మాట‌.