విక్టరీ వెంకటేష్ నెక్ట్స్ ఏంటీ? ..డైరెక్టర్ ఎవరు?

Sun May 29 2022 06:00:01 GMT+0530 (IST)

What's next for Victory Venkatesh? ..Who is the director?

విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ కలిసి నటించిన ఫ్యామిలీ హిలేరియస్ ఎంటర్ టైనర్ 'ఎఫ్ 2'. 2019 లో విడుదలై భారీ విజయాన్నిసొంతం చేసుకోవడమే కాకుండా ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీ వంద కోట్ల క్లబ్ లో చేరి ట్రేడ్ వర్గాలనే విస్మయానికి గురిచేసింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు శిరీష్ నిర్మించిన ఈ మూవీకి ఫ్రాంచైజీగా తాజాగా 'ఎఫ్ 3'ని రూపొందించారు అనిల్ రావిపూడి. ఈ శుక్రవారం మే 27న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ తొలి రోజే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ అనిపించుకుంది.'ఎఫ్ 2' కు మించి వుంటుందని ప్రారంభం నుంచి దర్శకుడు అనిల్ రావిపూడి చెబుతూ వచ్చారు. థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు అదే మాటని చెబుతూ సినిమాని సూపర్ హిట్ ని చేసేశారు. 'ఎఫ్ 2'లో వెంకీ ఆసన్ తో అదరగొట్టిన విక్టరీ వెంకటేష్ 'ఎఫ్ 3'లో రేచీకటి వున్న యువకుడిగా తనదైన పంథాలో నటించి నవ్వులు పూయించారు. ప్రతీ సీన్ లోనూ తనదైన మార్కు కామెడీని పండించి అద్భుతం అనిపించారు. ఇక నత్తి వున్న యువకుడిగా వరుణ్ తేజ్ కనిపించి వెంకీ మామతో కలిసి నవ్వులు పూయించాడు.

ఈ ఇద్దరి కలిసి సినిమాలో ఓ రేంజ్ లో ఫన్ ని జనరేట్ చేసిన తీరు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. 'ఎఫ్ 2' కు మెయిన్ పిల్లర్ గా నిలిచి ఆ మూవీ సక్సెస్ లో ప్రధాన పాత్ర పోషించిన విక్టరీ వెంకటేష్ 'ఎఫ్ 3'లోనూ అదే పాత్రని పోషించి ఈ చిత్రాన్ని కూడా విజయం వైపు నడిపించారని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత విక్టరీ వెంకటేష్ నెక్ట్స్ మూవీ ఏంటీ?.. దర్శకుడు ఎవరన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

విక్టరీ వెంకటేష్ 'ఎఫ్ 3' తరువాత బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ ప్రాజెక్ట్ లు చేయబోతున్నారు. ఈ రెండు చిత్రాలని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించబోతున్నారు. అయితే ఈ రెండు చిత్రాలని డైరెక్ట్ చేసేది ఎవరన్నది మాత్రం ఇంత వరకు వెంకటేష్ తో పాటు మేకర్స్ కూడా బయటపెట్టలేదు. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్ట్ లకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

ఇందులో ఓ మూవీని 'జాతిరత్నాలు' ఫేమ్ ఆనంద్ కె.వి డైరెక్ట్ చేయనున్నాడని తెలిసింది. ఈ మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఇటీవలే స్క్రిప్ట్ కి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అనుదీప్ కె.వి ప్రస్తుతం తమిళ హీరో శివ కార్తీకేయన్ తో ఓ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో వెంకీతో చేయనున్న మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ త్వరలో ప్రారంభం కాబోతోంది.

విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటిస్తూ నిర్మిస్తున్న 'కబీ ఈద్ కబీ దివాళీ' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ లో వెంకటేష్ ఎంటర్ కాబోతున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుంది. మరో పక్క రానా తో కలిసి నెట్ ఫ్లిక్స్ కోసం 'రానా నాయుడు' వెబ్ సిరీస్ ని చేస్తున్నారు. ఇది కూడా పూర్తి కాబోతోంది. వచ్చే ఏడాది ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.