Begin typing your search above and press return to search.
అభిరామ్ ను తేజ పెట్టిన టార్చర్ ఎలాంటిదంటే..!
By: Tupaki Desk | 31 May 2023 5:28 PMపలు సార్లు వాయిదాలు పడి ఎట్టకేల కు విడుదల కాబోతున్న చిత్రం అహింస. దగ్గుబాటి అభిరామ్ హీరో గా పరిచయం అవుతున్న ఈ సినిమా ను ప్రముఖ దర్శకుడు తేజ రూపొందించాడు. గీతికను ఈ సినిమా తో హీరోయిన్ గా తేజ పరిచయం చేస్తున్నాడు. గతంలో ఎంతో మంది హీరోల ను మరియు హీరోల ను తేజ తెలుగు ప్రేక్షకుల కు పరిచయం చేసిన విషయం తెల్సిందే.
గతంలో తేజ కొత్త వారిని పరిచయం చేసిన సమయంలో మరియు చిన్న హీరోల తో సినిమాలు చేసిన సమయంలో హీరోల ను మరియు హీరోయిన్ లను ఇతర నటీనటుల ను కొట్టి మరీ తనకు కావాల్సిన విధంగా నటింపజేసుకునే వారు అనే టాక్ ఉంది. తేజ తో వర్క్ చేయాలి అంటూ టార్చర్ ఉంటుందని చాలా మంది ఇండస్ట్రీలో మాట్లాడుకోవడం జరిగింది.
తాజాగా అహింస సినిమా ప్రెస్ మీట్ సందర్భంగా.. మీరు హీరోల ను హీరోయిన్స్ ను టార్చర్ పెడుతూ ఉంటారు అని ఒక టాక్ ఉంది. ఈ సినిమా కోసం అభిరామ్ మరియు గీతికల ను ఎంత వరకు టార్చర్ పెట్టారు అంటూ ఒక విలేకరి ప్రశ్నించాడు. అందుకు తేజ సమాధానంగా మీరు నేను టార్చర్ పెట్టినట్లు చూశారా అంటూ ఎదురు ప్రశ్నించాడు.
అదే ప్రశ్నకు తేజ ఇంకా మాట్లాడుతూ... అభిరామ్ ను టార్చర్ పెట్టిన మాట వాస్తవం. కానీ ఆ టార్చర్ అతడు హీరో గా మంచి సక్సెస్ అవ్వడానికే అన్నట్లుగా తేజ పేర్కొన్నాడు. మొదట రామానాయుడు స్టూడియో కింద నుండి కొండ పై వరకు రోజూ సైకిల్ తొక్కమని చెప్పాను. నేను చెప్పినట్లుగానే అభిరామ్ సన్నివేశం కోసం అన్నట్లుగా సైకిల్ తొక్కేవాడు.
సినిమా నుంచి ఆ సన్నివేశాన్ని తొలగించాను. ఆ తర్వాత హీరోయిన్ ను ఎత్తుకుని భుజానికి తుపాకీ వేసుకుని పరిగెత్తాల్సి ఉంటుంది. ఆ సన్నివేశం షూట్ చేస్తున్న సమయంలో అభిరామ్ కింద పడి గాయం అయ్యింది. దాంతో నాలుగు నెలల విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తర్వాత 50 కేజీల బరువు బరువు తో పరిగెత్తమని చెప్పాను. ప్రతి రోజు కూడా వీడియో ను నాకు పంపించాల్సి ఉంటుంది. అలా అభిరామ్ నేను చెప్పిన ప్రతి పనిని తాను ఒక స్టార్ ఫ్యామిలీ కి చెందిన వాడిని అని చూసుకోకుండా చేశాడు. దాన్ని టార్చర్ అనవచ్చు అంటూ తేజ పేర్కొన్నాడు.