Begin typing your search above and press return to search.
`తొలి ప్రేమ` కీర్తి రెడ్డి ఇప్పుడేం చేస్తోంది?
By: Tupaki Desk | 8 Feb 2023 10:00 AMపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన `తొలి ప్రేమ` లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించింది కీర్తి రెడ్డి. ఆ తర్వాత హీరో సుమంత్ ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల తర్వాతా ఆ ఇద్దరి స్నేహం కొనసాగుతోంది. ఆ సంగతిని సుమంత్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్లలో సుమంత్ - కీర్తి కలుస్తుంటారు. అలాంటి కొన్ని అరుదైన అకేషన్స్ తారసపడ్డాయి.
కీర్తి రెడ్డి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్.. మాజీ మిస్ ఇండియా శిల్పా రెడ్డికి కజిన్. కీర్తి రెడ్డి సోదరుడికి శిల్పా భార్య. అందుకే ఆ ఇద్దరూ చాలాసార్లు రకరకాల ఫంక్షన్లలో కనిపించి సందడి చేశారు. శిల్పారెడ్డికి అక్కినేని కుటుంబంతో ఎంతో అనుబంధం ఉంది. అలాగే సుమంత్ కూడా ఈ సంగతిని పలుమార్లు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ఇక కీర్తి రెడ్డికి విడాకులు ఇచ్చాక కూడా సుమంత్ తన స్నేహాన్ని కొనసాగించడానికి శిల్పాతో ఉన్న స్నేహానుబంధం ఒక కారణం.
ఇంతకుముందు శిల్పారెడ్డి తన సోషల్ మీడియాల్లో తమ కజిన్ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోల్ని షేర్ చేశారు. వీటిలో కీర్తి రెడ్డి- శిల్పారెడ్డితో కలిసి ఉన్న ఫోటోలు రివీలయ్యాయి. ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన మరో కజిన్ పెళ్లి వేడుకలో శిల్పారెడ్డి- కీర్తి రెడ్డి జోడీ ప్రత్యక్షమయ్యారు. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట షికార్ చేస్తున్నాయి.
కీర్తి రెడ్డి అమెరికా ఎన్నారై
కీర్తి రెడ్డి సుమంత్ నుంచి విడాకులు తీసుకున్న అనంతరం కొన్నాళ్లు ఒంటరిగా ఉన్నా ఆ తర్వాత ఒక అమెరికా ఎన్నారైని పెళ్లాడి లైఫ్ లో సెటిలయ్యారు. ఈ దంపతులకు ఇద్దరు వారసులు ఉన్నారు. కీర్తిరెడ్డి హైదరాబాద్ లో తమ బంధుమిత్రులు కుటుంబ వేడుకలకు హాజరైనప్పుడు ప్రతిసారీ ఫోటోలు ఇలా అంతర్జాలంలో సందడి చేస్తున్నాయి. కీర్తి రెడ్డి నటించిన తొలి ప్రేమ విడుదలై 25 సంవత్సరాలు పూర్తవుతోంది. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా ఇప్పటికీ కీర్తి అదే ఛామ్ తో కనిపిస్తున్నారని అభిమానులు కితాబిచ్చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.